Katrina Kaif | Engaged | Ring | Movie News | Stills

Katrina kaif wearing engagement ring

Katrina Kaif Engaged, Katrina Kaif Engagement ring, Katrina Kaif ring, Katrina Kaif wedding ring, Katrina Kaif engagement news, Katrina Kaif hot news, Katrina Kaif latest gossips, Katrina Kaif movies, Katrina Kaif hot stills, Katrina Kaif stills

Katrina Kaif wearing Engagement Ring: Katrina Kaif was spotted wearing a ring on her engagement finger recently, which is really surprising!

కత్రినా కైఫ్ చేతికి ఎంగేజ్ మెంట్ రింగ్?

Posted: 01/21/2016 11:21 AM IST
Katrina kaif wearing engagement ring

బాలీవుడ్ ప్రేమజంట రణ్ బీర్ కపూర్, కత్రినాకైఫ్ లు త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని గతకొద్ది రోజులుగా వార్తలొస్తూనే వున్నాయి. వీరిద్దరూ గతకొద్ది కాలంగా సహజీవనం చేస్తున్నారని బాలీవుడ్ జనాలు కోడైకూస్తున్నారు. ఇదిలా వుంటే కొన్నిరోజులుగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే కత్రినాకు ఎంగేజ్ మెంట్ అయిపోయినట్లుగా తాజాగా బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఇందుకు గల కారణం కత్రినాకైఫ్ చేతికి వున్న ఉంగరమే అని తెలుస్తోంది. ఇటీవలే రణ్ బీర్ కపూర్ మరియు కత్రినాలు ‘ఉమాంగ్ పోలీస్ షో 2016’ కార్యక్రమానికి విడివిడిగా హాజరయ్యారు. వీరిద్దరి కలుసుకొని మాట్లాడుకోలేదు. ఈ కార్యక్రమానికి ఒంటరిగా రాగా, రణ్ బీర్ తన తండ్రి రిషికపూర్ తో కలిసి వచ్చాడట. దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి, విడిపోయారని బాలీవుడ్ జనాలు ఫిక్స్ అయిపోయారు.

ఇదిలా వుంటే. ఇటీవలే ఓ కార్యక్రమానికి హాజరైన కత్రినా తన చేతికి ఉంగరంతో విచ్చేసింది. కానీ గతంలో ఈ అమ్మడు చేతికి ఎలాంటి ఉంగరం ధరించలేదు. కానీ తాజాగా ఈ ఉంగరాన్ని చూసిన వారంతా కూడా కత్రినాకు ఎంగేజ్ మెంట్ అయ్యిందని భావిస్తున్నారు. కానీ కత్రినా ఎంగేజ్ మెంట్ ఎవరితో అయ్యిందనే విషయం మాత్రం అర్థం కావడం లేదు. మరి ఇది ఎంగేజ్ మెంట్ ఉంగరమా కాదా అనే విషయం త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Katrina Kaif  Engaged  Ring  Movies  Stills  

Other Articles