Mega Heroine Niharika going sensational in youtube

Mega heroine niharika going sensational in youtube

Niharika, Mega Heroine Niharika, Niharika serical, Nagababu Daughter Niharika, Niharika as Heroine, Muddapappu Aavakay

Mega Heroine Niharika going sensational in youtube. Niharika doing a web serial named as Muddapappu Aavakay. She released the first episode on sankranthi eve.

యుట్యూబ్ లో దుమ్మురేపుతున్న మెగా హీరోయిన్

Posted: 01/18/2016 11:58 AM IST
Mega heroine niharika going sensational in youtube

తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ  అంటే అందరికి ఒక గౌరవం. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుండి అరడజనుకు పైగా హీరోలు తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు. అయితే మొదటిసారిగా మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న హీరోయిన్ గా నిహారికకు ప్రత్యేక గుర్తింపు ఉంది. బుల్లితెర మీద ఇప్పటికే అమ్మడు మంచి క్రేజ్ ను సంపాదించింది. ఇక మీదట వెండ తెర మీద కూడా మెరిసేందుకు సిద్దమైంది. నీహారిక ఇప్పుడు యూట్యూబ్ లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇటీవలే నీహారిక ముద్దపప్పు ఆవకాయ్ అనే షార్ట్ ఫిల్మ్ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. ఆ ట్రైలర్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ షార్ట్ ఫిల్మ్ ను యూట్యూబ్ లో వారానికి ఒకసారి రిలీజ్ చేయాలనుకొన్నారు. అందులో భాగంగా ఈ సంక్రాంతికి మొదటి ఎపిసోడ్ ని రిలీజ్ చేశారు.

ఈ ఫస్ట్ ఎపిసోడ్ లో నీహారిక నటనకు తన ఎనర్జీ డైలాగ్ మాడ్యులేషన్ కు అభిమానులు ఫిదా అయిపోయారు. యూ ట్యూబ్ లోని ఈ ఎపిసోడ్ కి రెండు రోజుల్లోనే మంచి వ్యూస్ లభించాయి... నీహారిక బాగా నటించిందని పొగిడేస్తున్నారు. దీంతో ‘‘ముద్దపప్పు ఆవకాయ్ కి వస్తున్న రెప్సాన్స్ చూసి ఆనందిస్తున్నాను మీరు పంపిన ప్రతి కామెంట్ చదివాను థాంక్స్ ఫర్ సంక్రాంతి ట్రీట్’’ అని మసెజ్ చేసింది. అభిమానులతో తన ఆనందాన్ని పంచుకొంది.  ‘ఒక్క మనసు‘ చిత్రంతో త్వరలో వెండితెరపై మెరవనున్న నాగబాబు కూతురు నిహారిక.. మరోవైపు వెబ్ సిరీస్ తోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తానే నిర్మాతగా మారి . ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ పేరుతో సొంత ప్రొడక్షన్ మొదలు పెట్టిన నిహారిక.. ‘ముద్దపప్పు ఆవకాయ’ పేరుతో వెబ్ సిరీస్ ను నిర్మిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Niharika  Mega Heroine Niharika  Niharika serical  Nagababu Daughter Niharika  

Other Articles