What Mega heros doing on Sankranthi

What mega heros doing on sankranthi

Mage Heros, Mega Heros cinemas on Sankranthi, Sankranthi Cinemas, Cinemas on Sankranthi Festival, Pawan kalyan, Power Star Pawan Kalyan, Allu Arjun

There no mega heros cinema on Sankranthis eve. Power Star Pawan Kalyan doing Sardar Gabbar Singh. The cinema presently on sets. Allu Arjun and Boyapati cinema also on sets.

సంక్రాంతికి "మెగా" హీరోలు ఏం చేస్తున్నారు?

Posted: 01/13/2016 03:09 PM IST
What mega heros doing on sankranthi

సంక్రాంతి 2016 ... నందమూరి సీనియర్ అండ్ జూనియర్, తమ సినిమాలతో ఈ పండుగ ఆనందాన్ని సినీ అభిమానుల్లో మరింతగా నింపేశారు... అక్కినేని వారసుడు కూడా, "సోగ్గాడు" గా రాబోతున్నాడు. మరి, సంక్రాంతి సంబరాలకి పెట్టింది పేరైన, "మెగా" క్యాంప్ హీరోల మాటేంటి?

నిజానికి, మిగితా వారికన్నా, "మెగా" క్యాంప్ లోనే ఎక్కువ మంది హీరోలు ఉన్నారు... ప్రతీ హీరోకీ "మెగా" ఫ్యాన్స్ క్రేజ్ తో పాటు, తనకంటూ సేపెరేట్ ఫ్యాన్స్ కుడా ఉన్నారు. మరెందుకో, ఈ సంక్రాంతి మీద "మెగా" హీరోలు పెద్దగా కాన్సంట్రేట్ చేసినట్టుగా అనిపించడం లేదు.

అలా అని, పూర్తిగా వదిలెయ్యనూ లేదు... సినిమాల రిలీజ్ లు లేవు సరే... కానీ తమదైన స్టయిల్ లో అదరగొట్టడానికీ, అభిమానులని మెస్మరైజ్ చెయ్యడానికి, సంక్రాంతే వేదికగా ఎంచుకున్నారు ఇద్దరు మెగా హీరోలు...

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ "సర్దార్ గబ్బర్ సింగ్" టీసర్, సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోందనీ టాక్... దీనిమీద సినీ వర్గాలు తమ తమ అంచనాలను ఆల్రెడీ రెడీ చేసే పని లో ఉన్నాయి. టీసరే విడుదల కాలేదు? అప్పుడే అంచనాలా? అనుకుంటున్నారా? మరి పవన్ క్రేజ్ అంటే మాటలా ...

మొన్నీమధ్య విడుదల అయిన "సర్దార్" షూటింగ్ లో వర్కింగ్ స్టిల్స్, సినిమా పై మరిన్ని ఆశలను, ఖచ్చితంగా పెంచేశాయి... ఇంక అనుకున్న టైమ్ కి టీసర్ కూడా విడుదల అయితే, పవర్ స్టార్ మెగా అభిమానుల ఆనందానికి హద్దే ఉండదు. పైగా ఈ సినిమాలో, "మెగా" స్టార్,  మెగా పవర్ స్టార్ కూడా మేరవబోతున్నారని టాక్... ఇదే టాక్ ని టీసర్ లో రివీల్ చేసి, మెగా అభిమానులకు కన్నుల పండుగ చేస్తాడేమో పవర్ స్టార్ . లెట్స్ వెయిట్ అండ్ వాచ్...

విభిన్న పాత్రలతో దూసుకెళుతున్న స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్, బోయపాటి తో కలిసి "సరైనోడు"గా రాబోతున్నాడు... బోయపాటి తరహా పవర్ఫుల్ హీరో పాత్ర తీరుతెన్నులకు బన్నీ "సరైనోడే" మరి... ఈ మూవీ ఫస్ట్ లుక్, సంక్రాంతికి రిలీజ్ చేస్తారని టాక్...

నిజమే... మెగా అభిమానులకు మెగా హీరోలా సినిమాలు సంక్రాంతికి లేవు... కానీ, ఇలా ఝలక్ లతో అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచేందుకు రెడీ అయిపోయారు మెగా హీరోలు!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mega Heros  Movie  Sankranti  NTR  

Other Articles