Nannaku Prematho | Audio Release Date | NTR

Nannaku prematho audio on 27 december

Nannaku Prematho Audio Release on 27 December, Nannaku Prematho Audio Release Date, Nannaku Prematho Movie News, Nannaku Prematho Movie Posters, Nannaku Prematho Movie stills, Nannaku Prematho Movie Release Date, Nannaku Prematho Audio, Ntr, Rakul Preet Singh

Nannaku Prematho Audio on 27 December: Young tiger ntr Nannaku Prematho Movie Audio Release on 27 December. Sukumar direction, Devi Sri Prasad Music, Rakul Preet singh heroine.

కన్ఫర్మ్: ఈనెల 27న ‘నాన్నకు ప్రేమతో’ పాటలు

Posted: 12/24/2015 05:58 PM IST
Nannaku prematho audio on 27 december

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, ఆర్య సుకుమార్‌ కాంబినేషన్‌లో రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న చిత్రం ‘నాన్నకు ప్రేమతో..’. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటించిన 25వ చిత్రంగా వస్తోన్న ఈ చిత్రం ఆడియో ఫంక్షన్‌ డిసెంబర్‌ 27న జరుగుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సంక్రాంతి కానుకగా జనవరి 13న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చెయ్యడానికి నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ ప్లాన్‌ చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ... ‘‘ఈ చిత్రం ఆడియోను డిసెంబర్‌ 27న రిలీజ్‌ చేస్తున్నాం. దేవిశ్రీప్రసాద్‌ ఈ చిత్రం కోసం అన్నీ సూపర్‌హిట్‌ సాంగ్స్‌ ఇచ్చారు. అలాగే ఆల్‌రెడీ ఈ సినిమా ఫస్ట్‌ హాఫ్‌ రీరికార్డింగ్‌కి పంపించాం. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ చాలా ఫాస్ట్‌గా జరుగుతోంది. వరల్డ్‌వైడ్‌గా సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేశాం. ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే అత్యంత కాస్ట్‌లియస్ట్‌ చిత్రంగా ‘నాన్నకు ప్రేమతో’ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా చాలా లావిష్‌గా చిత్రీకరిస్తున్నార. దర్శకుడు సుకుమార్‌ టెక్నికల్‌గా చాలా హై స్టాండర్డ్స్‌లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నార” అన్నారు.

యంగ్‌టైగర్‌, ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ: విజయ్‌ చక్రవర్తి, ఆర్ట్‌: రవీందర్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, పాటలు: చంద్రబోస్‌, డాన్స్‌: రాజు సుందరం, శేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుధీర్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్‌.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nannaku Prematho  Audio Release Date  NTR  Rakul Preet Singh  Stills  

Other Articles