ఫ్యామిలీ హీరోగా మంచి ప్రేక్షాకదరణ పొందిన విక్టరీ వెంకటేష్ ఇవాళ 55వ పడిలోకి అడుగుపెట్టారు. చానాళ్ల తరువాత టాలీవుడ్ లో ఆయన మల్టీ స్టారర్ చిత్రాలకు తెరలేపారు. మహేష్ ,పవన్ లాంటి స్టార్ హీరోలతో మల్టీ స్టారర్ చిత్రాలను తెరకెక్కించిన వెంకీ, వాటికి మంచి ఆదరణ వచ్చేలా ప్రయత్నించారు. వెంకటేష్ సినిమా అంటే అది పక్కా ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీనే అయి ఉంటుందనే భావనను అభిమానులలోకి తీసుకు వెళ్లారు. రామానాయుడు తనయుడిగా ఇండస్ట్రీకు ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి ప్రేక్షకులచే తన పేరు ముందు విక్టరీని ఇంటిపేరులా మార్చుకునేలా చేశారు.
1960 డిసెబంర్ 13 న జన్మించిన వెంకీ ఇప్పటి వరకు దాదాపు అన్ని రకాల పాత్రలను పోషించగా , ఎన్నో అవార్డులను అందుకున్నారు. చాలా గ్యాప్ తర్వాత దృశ్యం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్టరీ హీరో మల్టీ స్టారర్ చిత్రాలను మరింత ప్రోత్సహించారు. అయితే గోపాల గోపాల తర్వాత మరే సినిమా చేయని వెంకీ తాజాగా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వెంకటేష్ మారుతి డైరెక్షన్ లో బాబు బంగారం అనే చిత్రాన్ని చేయనుండగా త్వరలోనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నట్టు సమాచారం
కాగా విక్డరీ వెంకటేష్ జన్మదిన వేడుకను పురస్కరించుకుని.. వేడుకలు జరుపుకుంటున్న విక్టరీ వెంకటేష్ కు సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పలువురు హీరో హీరోయిన్లు, దర్శకులు గతంలో తాము వెంకటేష్ తో తీసుకున్న ఫోటోలను, సెల్ఫీలను పోస్ట్ చేస్తూ, అభినందనలు తెలిపారు. హీరో సుమంత్ "హ్యాపీ బర్త్ డే విక్టరీ వెంకటేష్ బావా" అంటే, హీరోయిన్ అనుష్క "విషింగ్ వెంకటేష్ దగ్గుబాటి గారూ, ఏ వెరీ హ్యాపీ బర్త్ డే" అంటూ విషెస్ చెప్పింది.
ఇక సాయికుమార్ "విషింగ్ 'విక్టరీ' వెంకటేష్ హ్యాపీ బర్త్ డే" అనగా, దగ్గుబాటి రానా "హ్యాపీ బర్త్ డే చిన్నాన్నా" అని, కమేడియన్ అలీ "విక్టరీ వెంకటేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయనతో ఎన్నో సినిమాలు కలిసి చేసినందుకు నేనెంతో అదృష్టవంతుడిని. అందరూ మెచ్చే వ్యక్తి ఆయన. మరెన్నో సంతోషకరమైన సంవత్సరాలు ఆయన ముందున్నాయి" అని అన్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ "విషింగ్ ఏ వెరీ హ్యాపీ బర్త్ డే టు వెంకటేష్ సార్! హోప్ యూ హ్యావ్ ఏ సూపర్బ్ ఇయర్" అనగా, దర్శకుడు రాజమౌళి "విషింగ్ వెంకటేష్ దగ్గుబాటి గారు, ఏ వెరీ హ్యాపీ బర్త్ డే!" అని తన శుభాకాంక్షలను పోస్ట్ చేశారు.
ఇలా తెలుగుచిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖులు, నటులు, నటీమణులును, దర్శకులు వెంకటేష్ కు జన్మదిన శుభాకాంక్షలను తెలిపారు. మంచి టైమింగ్ , ఢిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ , వెరైటీ కామెడీతో ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతున్న వెంకీ రానున్న రోజుల్లో తన సినిమాలతో మరింతగా అలరించాలని, ఇలాంటి బర్త్ డేలు మరెన్నో జరుపుకోవాలని మనమూ మనసారా కోరుకుంటటూ మెనీ హ్యాపీ రిటర్స్ అప్ ది డే చెబుదాం.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more