Ram Charan Upasana in Shata chandee yaagam special pooja at gandikota

Ram charan upasana in shata chandee yaagam special pooja at gandikota

Ram Charan Upasana special pooja at gandikota, Ram Charan special pooja at gandikota, Ram Charan in Shata chandee yaagam, Ram Charan stills, Ram Charan latest stills, Ram Charan movies, Ram Charan movie news, Ram Charan movie updates, Ram Charan

Ram Charan Upasana in Shata chandee yaagam special pooja at gandikota: Mega Powerstar Ram charan and Upasana perform special pooja at gandikota, Nizamabad.

చండీయాగంలో పాల్గొన్న చరణ్ దంపతులు

Posted: 12/11/2015 10:12 AM IST
Ram charan upasana in shata chandee yaagam special pooja at gandikota

టాలీవుడ్ హీరో రాంచరణ్ తన భార్య ఉపాసనతో కలిసి మహారుద్ర శత చండీయాగంలో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా దోమకొండ గండికోటలోని మహదేవుని ఆలయంలో గత పదిరోజుల నుంచి చండీయాగం జరిగాయి. ఈ చండీయాగం ముగింపు కార్యక్రమం, పూర్ణాహుతి గురువారం రోజున నిర్వహించారు.

ఈ చివరి రోజు పూజలో చరణ్, ఉపాసనలు కలిసి పాల్గొన్నారు. దాదాపు గంటపాటు ఆయన పూర్ణాహుతి, మహారుద్ర శతచండీ యాగంలో పాల్గొని పూజలు చేశారు. మహాదేవుని ఆలయంలో ప్రత్యేకంగా శివుడికి రుద్రాభిషేకం చేశారు. యాగం ముగింపులో పాల్గొని పూజలు చేయడం సంతోషంగా ఉందని రాంచరణ్ తెలిపారు.

ఇక సినిమా విషయానికొస్తే... ‘బ్రూస్ లీ’ తర్వాత రాంచరణ్ హీరోగా తమిళ హిట్ ‘థన్ ఒరువన్’ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. అలాగే రాంచరణ్ తో ‘రచ్చ’ వంటి హిట్ చిత్రాన్ని తీసిన దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో మరో చిత్రం తెరకెక్కబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Upasana  Shata chandee yaagam  special pooja  gandikota  

Other Articles