Baahubali | 4k movie | Youtube

Prabhas baahubali 4k film in youtube

Baahubali 4k film in Youtube, Baahubali in Youtube, Baahubali youtube news, Baahubali youtube movie, Baahubali latest news, Baahubali movie news, Baahubali collections, Baahubali movie, Baahubali Full video, Baahubali online video, Baahubali online movie, Baahubali

Prabhas Baahubali 4k film in Youtube: Prabhas latest blockbuster hit film Baahubali. This film 4k version release in Youtube. SS Rajamouli direction.

యూట్యూబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ‘బాహుబలి’

Posted: 12/03/2015 10:35 AM IST
Prabhas baahubali 4k film in youtube

దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై, రికార్డుల మోత మోగించిన విషయం తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా, తమన్నా, రమ్యకృష్ణ, అనుష్క, సత్యరాజ్, నాజర్ ప్రధాన పాత్రలలో నటించారు. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం తెలుగు ఇండస్ట్రీ గర్వించదగ్గ చిత్రంగా భారీ ప్రశంసలను మూటగట్టుకుంది.

తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషలలో విడుదలై కలెక్షన్ల రికార్డు క్రియేట్ చేసింది. ఇటీవలే ఈ నాలుగు భాషల టీవిల్లోనూ కూడా ప్రసారం అయ్యి, మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. దీంతో ఈసారి యూట్యూబ్ లో కూడా తన సత్తా చూపడానికి ‘బాహుబలి’ సిద్ధమయ్యింది. ‘బాహుబలి’ చిత్రాన్ని ఇండియాలో మొట్టమొదటిసారిగా 4k రిజల్యూషన్ తో యూట్యూబ్ లో విడుదల చేసారు.

ఈ చిత్రాన్ని 150 రూపాయాలకు ఆన్ లైన్ కొనుగోలు చేసి చూడవచ్చు. అలాగే 4కే రిజల్యూషన్‌‌తో చూడగల ఎక్విప్‌మెంట్ అందుబాటులో ఉన్నవారు ఆ అనుభూతిని పొందేందుకు బాహుబలి టీమ్ వీలు కల్పించింది. మరి యూట్యూబ్ లో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకోనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali  4k movie  youtube  online movie  stills  

Other Articles