తమిళంలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకొని, విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న బాలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘తారై తప్పట్టై’. ఇందులో సశికుమార్, వరలక్ష్మీ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టైటిల్ పోస్టర్లను విడుదల చేసారు.
ఇందులో శశికుమార్ గెటప్ చాలా కొత్తగా వుంది. అంతేకాకుండా ఈ పోస్టర్లో శశికుమార్ లుక్స్ పరంగా చాలా రౌద్రంగా కనిపిస్తున్నాడు. ఇక వరలక్ష్మీ కూడా ఓ విభిన్న పాత్రలో నటిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటివరకు గ్లామర్ పాత్రలలో, హాట్ హాట్ అందాలు ఆరబోసిన ఈ అమ్మడు తొలిసారిగా పూర్తిస్థాయి నటనకు ప్రాధాన్యం వున్న పాత్రలో నటిస్తున్నట్లుగా కనిపిస్తుంది.
ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అసలే బాలా సినిమాలకు అవార్డులు రావడం ఖాయం అనేది ఇప్పటికే చాలాసార్లు నిరూపణ అయ్యింది. మరి ఈ సినిమాలో వరలక్ష్మీ పాత్రకు ఖచ్చితంగా అవార్డులు వస్తాయని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more