Anushka | Thighs issue | Ali | Size Zero

Anushka clarifies about her thighs issue

Anushka talks about her Thighs issue, Ali on Anushka thighs, Anushka thighs, Size Zero movie news, Size Zero release date, Size Zero trailers, Size Zero booking, Size Zero stills, Size Zero movie updates, Size Zero, Anushka

Anushka clarifies about her Thighs issue: South Indian star heroine Anushka latest film Size Zero. This film will be released on 27 november. anushka busy in size zero promotions.

తన తొడల వివాదంపై అనుష్క క్లారిటీ!

Posted: 11/24/2015 04:53 PM IST
Anushka clarifies about her thighs issue

సినీ నటుడు, కమెడియన్ ఆలీ గతకొద్ది కాలంగా తన నోటి దురుసు వల్ల పలు వివాదాల్లో ఇరుక్కుంటున్న విషయం తెలిసిందే. తోటి నటీనటులపై వల్గర్ గా కామెంట్లు చేయడం, డబుల్ మీనింగ్ డైలాగ్ లు మాట్లాడటం అందరికి తెలిసిందే. గతంలో సమంతపై కూడా ఇలాగే కామెంట్లు చేసినప్పటికీ, సమంత కూడా ఆ విషయాన్ని లైట్ తీసుకోవడంతో ఎవరేమి పట్టించుకోలేరు. కానీ ఈ మధ్య ఆలీ నోటి దురుసు మరీ ఎక్కువయ్యిందని విమర్శలు వస్తున్నాయి.

ఇటీవలే ‘సైజ్ జీరో’ ఆడియో వేడుకలో హీరోయిన్ అనుష్క తొడలపై భారీ హాట్ కామెంట్లు చేసాడు ఆలీ. ఒక ఆడపిల్ల తొడల గురించి అలా పబ్లిక్ గా అలా చెత్త కామెంట్లు చేయడంతో మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాయి. అయితే ఈ విషయంపై ఆలీ కూడా స్పందిస్తూ.. అలా వల్గార్ ఏం మాట్లాడలేదని, తానేంటో తన తోటి నటీనటులకు తెలుసని, ఇవన్నీ కూడా కేవలం కాసేపు నవ్వించడానికేనని స్పష్టం చేసాడు. కానీ ఆలీ స్పందనకు మహిళా సంఘాలు శాంతించలేదు.

కామెడీ కోసం ఆడవాళ్లపై చెత్త కామెంట్లు చేయడం, తొడల గురించి మాట్లాడటం, డబుల్ మీనింగ్ డైలాగ్ లతో కామెంట్లు చేయడమేంటని ఆలీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అనుష్క నటించిన ‘సైజ్ జీరో’ సినిమా విడుదలకు సిద్ధంగా కావడంతో.. చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా వున్నారు. ఈ ప్రమోషన్లో భాగంగా తన తొడల గురించి ఆలీ చేసిన కామెంట్లపై అనుష్క చాలా తేలికగా తీసుకోవడంతో మళ్లీ ఈ టాపిక్ చర్చనీయాంశమైంది.

అనుష్క ఈ విషయంపై స్పందిస్తూ... ఆలీ తనకు మంచి మిత్రుడని, అతడు ఏదో సరదాకు కామెంట్ చేసాడే తప్ప, కావాలని అలాంటి వ్యాఖ్యలు చేయలేదని, అతడు ఎలాంటి వాడో, అతని కుటుంబం ఎలాంటిదో తనకు బాగా తెలుసని.. కాబట్టి తానేం ఈ మాటలను సీరియస్ గా తీసుకోవడం లేదని కొట్టిపారేసింది. అనుష్క మాటలకు అక్కడివారంతా ఒక్కసారిగా షాకయ్యారు.

అనుష్క మాటలకు ప్రస్తుతం మహిళా సంఘాలు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్నటివరకు ఆలీ మీద కామెంట్లు చేసిన మహిళలే ప్రస్తుతం అనుష్కపై కూడా కామెంట్లు చేస్తున్నారు. తన తొడల గురించి బహిరంగంగా చెత్త కామెంట్లు చేసినా కూడా పట్టించుకోకుండా కొట్టిపారేసిన అనుష్కపై మహిళా సంఘాలు గరంగరంగా వున్నాయి. మరి భవిష్యత్తులో ఏం జరుగనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anushka  thighs issue  Ali  Size Zero  Vulgar  stills  

Other Articles