kumari 21 F Adult Effect on Nannaku Prematho

Kumari 21 f adult effect on nannaku prematho

Ntr fans in tension after watching kumari 21 F, Ntr fans in tension, Ntr fans in tension about kumari 21 F, Ntr fans scared kumari 21 F, kumari 21 F movie talk, kumari 21 F hot news, Ntr Fans, Nannaku Prematho movie news, Nannaku Prematho stills, Nannaku Prematho posters, Nannaku Prematho teaser

kumari 21 F Adult Effect on Nannaku Prematho: Young tiger Ntr latest film Nannaku Prematho. Sukumar direction. This film will be release on pongal 2016.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను వణికిస్తున్న కుమారి

Posted: 11/21/2015 12:28 PM IST
Kumari 21 f adult effect on nannaku prematho

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులంతా ‘నాన్నకు ప్రేమతో’ సినిమా విషయంలో తెగ భయపడిపోతున్నారు. ముఖ్యంగా ఈ సినిమా దర్శకుడు సుకుమార్ విషయంలో వారంతా కంగారుపడుతున్నారు. ఇందుకు గల కారణం తాజాగా విడుదలై ‘కుమారి21ఎఫ్’ సినిమా.

‘కుమారి21 ఎఫ్’ సినిమాకు సుకుమార్ అన్ని తానై నడిపించేసాడు. ఇందులో అడల్ట్ కంటెంట్ మరీ భీభత్సంగా వుండటంతో ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమా మధ్యలో నుంచే లేచి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. మొన్నటివరకు బూతు చిత్రాల డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మారుతి కాస్త.. ఇటీవలే ‘భలే భలే మగాడివోయ్’ వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రాన్ని తీసి, తనపై వున్న ఆ బూతు మార్క్ ను తొలగించుకున్నాడు. మారుతి తర్వాత సుకుమార్ ‘కుమారి 21 ఎఫ్’తో ఆ స్థానంలోకి రీప్లేస్ అయినట్లుగా కనిపిస్తోంది.

ఈ సినిమాతో సుకుమార్ నిర్మాణం రంగంలోకి అడుగెట్టడమే కాకుండా కథ, స్ర్కీన్ ప్లే ను కూడా అందించాడు. యువతకు నచ్చే విధంగా బోలెడన్నీ బోల్డ్ సీన్లతో కుమ్మేసాడు సుకుమార్. ఈ సినిమా చూసిన ఎన్టీఆర్ అభిమానులు ప్రస్తుతం కంగారు పడుతున్నారు. ఎందుకంటే సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కూడా ఇదే విధంగా ఏమైనా బోల్డ్ కంటెంట్ సీన్లను సుకుమార్ తెరకెక్కిస్తున్నాడేమో అని అభిమానులు భయపడుతున్నారు.

ఇక ఎలాగో నిర్మాణ రంగంలోకి మొదటిసారి కాబట్టి.. ఇలా అడల్ట్ డోస్ పెంచేసి రూపొందించాడు. అలాగే మహేష్ బాబుతో తొలిసారిగా తీసిన ‘1 నేనొక్కడినే’ సినిమాను కూడా చాలా విభిన్నంగా చూపించాలని అనుకొని తీసాడు. కానీ ఆ సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చకపోవడంతో ఘోరంగా ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం ఎన్టీఆర్ తో కూడా సుకుమార్ కు ఇదే తొలి చిత్రం.

కాబట్టి.. ఎన్టీఆర్ తో కూడా ఏమైనా విభిన్న సినిమా ప్లాన్ చేసి, సుకుమార్ ప్రయోగాలు చేస్తున్నాడేమోనని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు. పైగా ‘కుమారి21 ఎఫ్’ చిత్రాన్ని చూసిన ఎన్టీఆర్ కూడా.. ఈ సినిమాపై ప్రశంసలు కురిపించేసాడు. మరి ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో కూడా ఇలాంటి అడల్ట్ సీన్లు ఏమైనా వుండనున్నాయో ఏమో చూడాలి. మొత్తానికి ‘కుమారి21ఎఫ్’ అడల్ట్ ఎఫెక్ట్ ఎన్టీఆర్ అభిమానులను బాగానే టెన్షన్ పెడుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Kumari 21 F  Nannaku Prematho  Fans  Sukumar  Stills  

Other Articles