Nikhil Shankarabharanam Movie Censor Report

Nikhil shankarabharanam movie censor report

Shankarabharanam Movie Censor Report, Nikhil Shankarabharanam Movie Censor Report, Nikhil Shankarabharanam Censor Report, Nikhil Shankarabharanam Movie News, Nikhil Shankarabharanam Release Date, Nikhil Shankarabharanam Trailers, Nikhil Shankarabharanam Songs, Nikhil Shankarabharanam Audio Jukebox, Nikhil Shankarabharanam video songs, Nikhil Shankarabharanam stills, Nikhil Shankarabharanam posters, Nikhil, Shankarabharanam

Nikhil Shankarabharanam Movie Censor Report: Actor nikhil latest film Shankarabharanam. Uday Nandanavanam director. Nandita heroine. Anjali acts in special role. This fill will be release on 4th December.

U/A సర్టిఫికెట్ దక్కించుకున్న ‘శంకరాభరణం’

Posted: 11/13/2015 10:59 AM IST
Nikhil shankarabharanam movie censor report

స్వామి రారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య.. ఇలా వరుసగా వైవిధ్యభరితమైన చిత్రాలు చేస్తూ, ముందుకు దూసుకెళుతున్న నిఖిల్ నటించిన తాజా చిత్రం 'శంకరాభరణం'. నందిత కథానాయికగా నటించింది. ప్రముఖ రచయిత కోన వెంకట్ సమర్పణలో ఎం.వీ.వీ. సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రానికి ఉదయ్ నందనవనమ్ దర్శకుడు. 'గీతాంజలి' వంటి విజయం తర్వాత ఎంవీవీ సినిమా సంస్థ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. డిసెంబర్ 4న ఈ చిత్రం విడుదల కానుంది.

ఈ సందర్భంగా కోన వెంకట్ మాట్లాడుతూ - ''అన్ని పాటలకూ మంచి ఆదరణ లభిస్తోంది. హారర్ కి కామెడీ మిక్స్ చేసి, మేం తీసిన 'గీతాంజలి' ఘనవిజయం సాధించింది. ఇప్పడు క్రైమ్ లో కామెడీ మిక్స్ చేసి 'శంకరాభరణం' చేశాం. ఇంతకుముందు క్రైమ్ కామెడీ సినిమాలు చాలా వచ్చాయి కానీ ఇది చాలా డిఫరెంట్. ఈ సినిమాలో సెట్స్ ఉపయోగించలేదు. టాకీ మాత్రమే కాదు... చివరికి పాటలను కూడా సహజమైన లొకేషన్స్ లోనే తీశాం. బీహార్ లోని డేంజరస్ లొకేషన్స్ లో, పుణేకి దగ్గరలో ఎవరూ చేయని లొకేషన్స్ లో, యూఎస్ లో కొంత భాగం చిత్రీకరించాం.

కథ గురించి చెప్పాలంటే.. యూఎస్ కి చెందిన అత్యంత సంపన్నుడి కొడుకు హీరో నిఖిల్. ఈ ప్రపంచంలో సుఖపడేవాళ్లు, కష్టపడి పనిచేసేవాళ్లు.. ఈ రెండు జాతులే ఉంటాయన్నది హీరో నమ్మకం. తాను సుఖపడటానికే పుట్టానన్నది అతని ఫీలింగ్. అలాంటి అతను ఓ పని మీద ఇండియా వచ్చి, అనుకోకుండా కష్టాల్లో చిక్కుకుంటాడు. వాటి నుంచి ఎలా తప్పించుకున్నాడనే కథాంశంతో సినిమా సాగుతుంది. ఇందులో అంజలి స్పెషల్ క్యారెక్టర్ చేసింది. సుమన్, సితార, రావు రమేశ్, సప్తగిరి.. ఇలా మొత్తం 40 మంది ప్రముఖ నటీనటులు నటించారు. భారీ నిర్మాణ వ్యయంతో రూపొందించాం'' అని చెప్పారు.

నిర్మాత మాట్లాడుతూ- ''మా సంస్థ నుంచి వచ్చిన 'గీతాంజలి' ఘనవిజయం సాధించింది. మలి చిత్రం కూడా అలానే ఉండాలని తొమ్మిది నెలలు వెయిట్ చేసి, ఈ చిత్రకథను ఎంపిక చేశాం. కోన వెంకట్ మంచి కథ ఇచ్చారు. ఆ కథను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. కథ డిమాండ్ చేసిన మేరకు రాజీపడకుండా భారీ బడ్జెట్ తో నిర్మించాం. డిసెంబర్ 4న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం'' అని చెప్పారు.

రావు రమేశ్, సత్యం రాజేశ్, షకలక శంకర్, సుజయ్ మిశ్రా, పిటూబాష్ త్రిపాఠి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: సాయి శ్రీరామ్, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, ఎడిటింగ్: చోటా కె. ప్రసాద్, రచనా సహకారం: వెంకటేశ్ కిలారు, భవాని ప్రసాద్, డ్యాన్స్ మాస్టర్స్: శేఖర్-శివ, ఫైట్ మాస్టర్: విజయ్, మేనేజర్స్: నాగు-రవి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రామన్ చౌదరి, సహ నిర్మాతలు: వి.ఎస్.ఎన్. కుమార్ చీమల, జి. వెంకటేశ్వరావ్, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు: కోన వెంకట్, దర్శకత్వం: ఉదయ్ నందనవనమ్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nikhil  Shankarabharanam  Censor Report  Release Date  Stills  

Other Articles