amir khan dubbing for mahesh murugadoss movie

Aamir khan to help mahesh babu by giving voice

bollywood Mr. perfect amir khan, tollywood prince Mahesh babu, Aamir to help Mahesh by giving voice, murugadoss movie, big budget movie, Aamir khan, Mahesh babu, dubbing, Murugadoss, Tollywood, Kollywood, Bollywood

bollywood Mr. perfect hero amir khan to help tollywood prince Mahesh babu by giving his voice in murugadoss movie

మహేష్ కు మాట సాయం చేయనున్న బాలీవుడ్ స్టార్ హీరో

Posted: 11/08/2015 11:02 PM IST
Aamir khan to help mahesh babu by giving voice

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్.. తాజాగా మహేష్ బాబు సినిమాకు మాట సాయం చేయనున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా టాక్ నడుస్తోంది.  మహేష్ సినిమాకు అమీర్ చేసే మాట సాయం ఏంటి అనుకుంటున్నారా..? ప్రస్తుతం బ్రహ్మోత్సవం సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న మహేష్, ఆ సినిమా తరువాత మురుగదాస్ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. వంద కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ ఒకేసారి తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాకు తెలుగు, తమిళ భాషల్లో స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటున్న మహేష్.. హిందీలో మాత్రం వేరే ఎవరితో అయినా డబ్బింగ్ చెప్పిస్తే బాగుంటుందని ఫీలయ్యాడట. ఇటీవల సల్మాన్ హీరోగా తెరకెక్కిన సినిమాకు రామ్ చరణ్ డబ్బింగ్ చెప్పటంతో అదే ఫార్ములాను మహేష్ మూవీ కోసం ఫాలో అవుతున్నారు. మహేష్, మురుగదాస్ ల కాంభినేషన్ లో తెరకెక్కనున్న సినిమాకు అమీర్ ఖాన్ తో డబ్బింగ్ చెప్పించే ఆలోచనలో ఉన్నారట. గతంలో మురుగదాస్ డైరెక్షన్ లో గజిని లాంటి సూపర్ హిట్ సినిమాలో నటించిన అమీర్, మహేష్ పాత్రకు డబ్బింగ్ చెప్పేందుకు తప్పకుండా అంగీకరిస్తారన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Aamir khan  Mahesh babu  dubbing  Murugadoss  Tollywood  Kollywood  Bollywood  

Other Articles