Sri Divya | Vishal | Glamour roles

Vishal to romance sri divya in marudhu

Sri Divya Romance with Vishal, Sri Divya Ready for glamour roles, Sri Divya with Vishal, Sri Divya hot news, Sri Divya latest hot news, Sri Divya stills, Sri Divya glamour stills, Sri Divya hot gossips, Sri Divya movies, Sri Divya movie news, Sri Divya, Vishal

Vishal to romance Sri Divya in Marudhu: Kollywood young star heroine Sri Divya Ready for glamour roles. Actress Sri Divya introduced in the movie of 'Varutthappadatha vaalibar sangam' in Tamil.

విశాల్ తో రొమాన్స్ కు సిద్ధమైన శ్రీదివ్య

Posted: 11/05/2015 12:41 PM IST
Vishal to romance sri divya in marudhu

తెలుగులో ‘బస్ స్టాప్’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీదివ్యకు.. ఆ తర్వాత తెలుగులో అంతగా అవకాశాలు రావకపోవడంతో కోలీవుడ్ కు వెళ్లిపోయింది. తెలుగులో కూడా ఈ అమ్మడు నటించిన సినిమాలు కూడా అంతగా విజయం సాధించలేదు. కానీ శ్రీదివ్య తమిళంలో నటించిన మొదటి సినిమాయే భారీ విజయం సాధించడంతో ప్రస్తుతం కోలీవుడ్ లో యంగ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది.

మొన్నటివరకు కేవలం హోమ్లీ పాత్రలతోనే మెప్పించిన ఈ అమ్మడికి ప్రస్తుతం వస్తున్న యంగ్ సెక్సీ హీరోయిన్ల నుంచి భారీ పోటీ ఏర్పడింది. ఈ మధ్యన వచ్చే హీరోయిన్లంతా కూడా గ్లామర్ వైపే ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. దీంతో శ్రీదివ్య వంటి హీరోయిన్లకు అవకాశాలు రాకుండా పోతున్నాయి. అయితే తానుకూడా గ్లామర్ పాత్రలకు సిద్దమేనని శ్రీదివ్య గ్లామర్ పాత్రలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది.

తాజాగా విశాల్ తో కలిసి నటించడానికి ఒప్పుకుంది. ఇందులో శ్రీదివ్య పాత్ర చాలా గ్లామరస్, రొమాంటిక్ గా వుండనుందని తెలిసింది. ముత్తయ్య దర్శకత్వంలో విశాల్ హీరోగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘మరుదు’ అనే టైటిల్ ఖరారు చేసారు. ఇందులో శ్రీదివ్య పాత్ర చాలా గ్లామర్ గా వుండనుందని తెలిసింది. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sri Divya  Vishal  glamour roles  Lip lock  Movie News  Stills  

Other Articles