gunashekar planing to direct mythological film veerabhimanyu

Gunashekar next mythological film veerabhimanyu

gunashekar, mythological, veerabhimanyu,, gunashekar movies, gunashekar wiki, gunashekar director, gunashekar family, rudramadevi, gunashekar twitter,gunashekar facebook,

tollywood director gunashekar planing to direct another mythological film veerabhimanyu after rudramadevi

విల్లు ఎక్కుపెడుతున్న ‘వీరాభిమన్యు’

Posted: 11/01/2015 07:52 PM IST
Gunashekar next mythological film veerabhimanyu

రుద్రమదేవి సినిమాతో తెలంగాణ వీర వనిత జీవిత విశేషాలను తెలుగు ప్రేక్షకులకు తెలియజెప్పిన దర్శకుడు గుణశేఖర్, అదే స్థాయిలో మంచి విజయాన్ని సాధించాడు. ఎన్నో కష్టనష్టాలను దాటి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన దర్శకుడు వసూళ్ల పరంగాను మంచి రికార్డులనే నమోదు చేశాడు. ఇప్పుడు ఇదే జోష్ లో మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఈసినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. రుద్రమదేవి సినిమా సమయంలోనే ఆ సినిమాకు సీక్వల్ తీసే ఆలోచన ఉందంటూ ప్రకటించాడు గుణశేఖర్. కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఆఖరి రాజు ప్రతాపరుద్రుడి జీవితాన్ని వెండితెర మీద ఆవిష్కరించాలని భావించాడు.

అయితే ఇప్పుడు ఆ నిర్ణయాన్ని విమరమించుకొని మరో ప్రాజెక్ట్ కు రెడీ అవుతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. చారిత్రక చిత్రంతో ఘనవిజయం సాధించిన గుణా టీం ఈ సారి పౌరాణిక గాథ మీద దృష్టిపెట్టింది. వీరాభిమన్యు పేరుతో మహాభారతంలోనే ఓ ఘట్టాన్ని సినిమాగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట గుణశేఖర్. ఇప్పటికే అందుకు సంబందించి వీరాభిమన్యు అనే టైటిల్ ను ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించాడు. ఇదే పేరుతో శోభన్ బాబు కథనాయకుడిగా 1965లో ఓ సినిమా రిలీజ్ అయ్యింది. అయితే ప్రస్థుతం సాంకేతిక ఎన్నో మార్పులు వచ్చాయి కాబట్టి భారీగా ఈసినిమాను తెరకెక్కించే అవకాశం ఉంది. మరి ఈ పౌరాణిక కథతో వీరాభిమన్యుడిగా ఎవరు నటిస్తారో చూడాలి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gunashekar  mythological  veerabhimanyu  Rudhramadevi  

Other Articles