Comedian Ali’s sensational remarks on politics

Comedian ali responded about his political entry

comedian ali\'s political plans,ali,politics,bjp,tdp,ysrcp,janasena,comedians,rajendraprasad,groups,factionsim,Ali, Tollywood actor, politics, sensational remarks, ali sensational remarks on politics, ali remarks on politics, ali on politics

Clearing the air about his political plans, Ali said, “I’m not jumping politics as of now. In the very beginning there used to be political parties but now there is only groupism and factionism that’s prevailing. I need more time to take a decision.

రాజకీయాలపై కమేడియన్ అలీ సంచలన వ్యాఖ్యలు

Posted: 10/25/2015 08:51 PM IST
Comedian ali responded about his political entry

రాజకీయాలపై సంచలనకర వ్యాఖ్యలు చేశారు సినీ హాస్యనటుడు ఆలీ. తన రాజకీయ అరంగ్రేటంపై మీడియాతో మాట్లాడిన ఆయన ప్రస్తుతానికి రాజకీయాలలోకి రావాలని లేదని, దానికి ఇంకా సమయముందని అన్నారు. గతంలో పార్టీలుండేవని, నేడు వర్గాలుగా మారాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. నూజివీడులో నిర్వహిస్తున్న అఖిలభారత కబడ్డీ పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. 35 ఏళ్ల  సినీ జీవితంలో  నేను నటించిన సినిమాలలో రెండు సినిమాలు ఎంతో ఇష్టం, అవి ఒకటి హీరోగా చేసిన యమలీల, రెండోది కమేడియన్‌గా చేసిన రాజేంద్రుడు-గజేంద్రుడు అని తెలిపారు.
 
ఏ వ్యక్తి అయినా తాను నమ్ముకున్న వృత్తిపై శ్రద్ధపెట్టి  కష్టపడి పనిచేస్తే ఆ వృత్తిలో పైస్థాయికి వెళ్లడం  ఖచ్ఛితంగా జరుగుతుందన్నారు. సీతాకోకచిలుక సినిమాలో తాను నటించినప్పుడు రూ.2500 పారితోషికం ఇచ్చారని, దానికి అవార్డు రాగా, అవార్డు కింద మాత్రం రూ.5వేలు ఇవ్వడం అప్పట్లో తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. మహమ్మద్ బాషా చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేసి తొమ్మిదేళ్లుగా ప్రతి ఏటా మార్చిలో భర్త చనిపోయిన మహిళలకు, టైలర్స్‌కు ఆర్థిక సాయం చేస్తున్నానన్నారు.
 
వృద్ధ మహిళలకు  పింఛన్ అందజేస్తున్నానన్నారు. రాజమండ్రిలో వాటర్‌ప్లాంటు ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా మంచినీటిని అందిస్తున్నానన్నారు. సెన్సార్ నిబంధనలు వర్తిస్తే ప్రస్తుతం టీవీల్లో ప్రసారమవుతున్న షోలు నిలిపివేసి భక్తి కార్యక్రమాలను ప్రసారం చేసుకోవాల్సి వస్తుందన్నారు. రేటింగ్ కోసం చానళ్ల మధ్య పోటీ ఎక్కువగా ఉందన్నారు. సమాజంలో ఎవరినీ దూరం చేసుకోవద్దు...అని చెప్పిన మా నాన్న మాటలు తనకు ఎప్పుడు గుర్తుంటాయని అలి అన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ali  Tollywood actor  politics  sensational remarks  

Other Articles