Koratala Shiva directing Young Tiger NTR after Nannaku Prematho

Koratala shiva directing ntr after nannaku prematho

NTR, NTR next film, Nannaku Prematho, Koratala Shiva, Koratala Shiva with NTR, NTR with Koratala, Koratala new film, Srimanthudu, Mirchi, Nannaku Prematho stills, Nannaku Prematho news, NTR Nannaku Prematho, Koratala updates

Young Tiger NTR has been busy shooting for his stylish revenge drama Nannaku Prematho in Sukumar's direction. Now, just a few days before he flies off to Spain for a small schedule, NTR is all set to launch his next film in Koratala Siva's direction on 25th October. The film will be produced by Mythri Movie Makers, the hot shot production house which is riding high with the success of its debut film Srimanthudu.

ఎన్టీఆర్ కొత్త సినిమా టైటిల్ ఇదే

Posted: 10/24/2015 09:44 AM IST
Koratala shiva directing ntr after nannaku prematho

టెంపర్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద తన టెంపర్ ను చూపించారు జూనియర్ ఎన్టీఆర్. కలెక్షన్ల వర్షం కురిపించడంతో పాటు ఎన్టీఆర్ కెరీర్ కు మంచి బ్రేక్ ఇచ్చింది టెంపర్. కాగా టెంపర్ తర్వాత ఎన్టీఆర్ సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న నాన్నకు ప్రేమతో ఇప్పటికే తెలుగు సినిమా వర్గాల పల్స్ ను పెంచేసింది. కొత్త లుక్ లో తారక్ అందరికి భలే సర్ ప్రైజ్ చేశారు. తాజాగా విడుదలైన నాన్నకు ప్రేమతో టీజర్ సోషల్ మీడియాలో రికార్డుల మోత మోగించింది. ఒక్క రోజు లోనే మిలియన్ మంది ఈ వీడియోను చూడడం.. భారీగా లైక్ లు రావడంతో ఈ సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి.  కాగా మరి నాన్నకు ప్రేమతో సినిమా తర్వాత ఎన్టీఆర్ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో వస్తోంది. శ్రీమంతుడు సినిమా సక్సెస్ తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఎన్టీఆర్ సినిమా టైటిల్ కూడా దాదాపు ఖరారైంది.

ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న కొత్త సినిమా పేరు ‘జనతా గ్యారేజ్’ అని తెలుస్తోంది. దీనికి ట్యాగ్ లైన్ కూడా ఖరారైంది. జనతా గ్యారేజ్.. అన్నీ రిపేర్ చెయ్యబడును. కాగా సినిమా టైటిల్ మీద డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్లు కానీ అపీషియల్ గా ఎలాంటి ప్రకటన చెయ్యలేదు. ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా ఫ్యామిలీ ఎంటర్ టేనర్ గా తెరకెక్కుతోందని తెలుస్తోంది. కాగా ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా మీద అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. నిజానికి కొరటాల శ్రీమంతుడు సినిమా కంటే ముందుగానే ఎన్టీఆర్ కు స్టోరీ వినిపించినా.. కొన్ని కారణాల వల్ల సెట్స్ పైకి వెళ్లలేదు. కొరటాల శివ మిర్చి, శ్రీమంతుడు సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడం... టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఇద్దరికీ ఎంతో ప్రెస్టీజియస్ గా జనతా గ్యారేజ్ తెరకెక్కనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles