Aishwarya Rai Bachchan | Sujoy Ghosh | Durga Rani Singh

Aishwarya rai bachchan in durga rani singh role

Aishwarya Rai Bachchan in Sujoy Ghoshs Durga Rani Singh, Aishwarya Rai Bachchan in Durga Rani Singh, Aishwarya Rai Bachchan as Durga Rani Singh, Aishwarya Rai Bachchan latest news, Aishwarya Rai Bachchan movies, Aishwarya Rai Bachchan movie news, Aishwarya Rai Bachchan movie updates, Aishwarya Rai Bachchan stills, Aishwarya Rai Bachchan hot news, Aishwarya Rai Bachchan

Aishwarya Rai Bachchan in Durga Rani Singh Role: Aishwarya Rai Bachchan upcoming film with director Sujoy Ghosh. This film title Durga Rani Singh.

‘దుర్గా రాణీ సింగ్’ పాత్రలో ఐశ్వర్యరాయ్

Posted: 10/12/2015 03:57 PM IST
Aishwarya rai bachchan in durga rani singh role

సినిమాలకు చాలా కాలం విరామం తీసుకొని అందాల భామ ఐశ్వర్యరాయ్ నటించిన ‘జజ్బా’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ‘జజ్బా’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టిన ఐశ్వర్యారాయ్ కు ప్రస్తుతం వరుస ఆఫర్లు వచ్చిపడుతున్నాయి.

కానీ ఐశ్వర్యారాయ్ మాత్రం సెలెక్టివ్ గా కథలను ఎంపిక చేసుకుంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడికి వైవిధ్యమైన పాత్రలే లభిస్తున్నాయి. సరబ్ జీత్ సింగ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రంలోనూ, కరణ్ జోహార్ తీస్తున్న ‘అయ్ దిల్ హై ముష్కిల్’ చిత్రంలో ఐశ్వర్యారాయ్ కు విభిన్న పాత్రలే లభించాయి.

తాజాగా పోలీస్ ఆఫీసర్ పాత్రకు ఐశ్వర్యారాయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సుజోయ్ ఘోష్ చెప్పిన ఓ కథకు ఐశ్వర్యారాయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. ఇందులో ఐశ్వర్యారాయ్ పవర్ ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ నిజ జీవిత కథతో రూపొందునున్న ఈ చిత్రానికి ‘దుర్గారాణీ సింగ్’ అనే టైటిల్ ను ఖరారు చేసారు.

ఈ సినిమా కోసం ముందుగా కంగనా రనౌత్, విద్యా బాలన్ వంటి హీరోయిన్ల పేర్లు వినిపించాయి. కానీ చివరకు ఈ పాత్ర ఐశ్వర్యారాయ్ కే దక్కింది. ఇటీవలే ఈ సినిమా విశేషాలు తెలియజేస్తూ... ఇటీవలే సుజోయ్ ఘోష్ కొన్ని కథలతో సంప్రదించారు. అందులో ‘దుర్గా...’ కథ నాకు బాగా నచ్చింది. అన్నీ కుదిరితే త్వరలోనే అది చేసే ఛాన్స్ వుందని ఐశ్వర్యారాయ్ చెప్పుకొచ్చింది. మరి ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aishwarya Rai Bachchan  Sujoy Ghosh  Durga Rani Singh  movie news  stills  

Other Articles