Shivraj Kumar | Hospitalised | Movie News | Latest news | stills

Kannada star shivraj kumar hospitalised

Kannada Star Hero Shivraj Kumar Hospitalised, Shivraj Kumar Hospitalised, Shivraj Kumar latest news, Shivraj Kumar health news, Shivraj Kumar health updates, Shivraj Kumar movies, Shivraj Kumar movie news, Shivraj Kumar latest details, Shivraj Kumar

Kannada Star Shivraj Kumar Hospitalised: Kannada Star Hero Shivraj Kumar, also known as Shivanna was hospitalised after he complained of uneasiness and chest pain on Tuesday morning. He was later admitted in Mallya hospital by his family members.

హాస్పిటల్లో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్

Posted: 10/06/2015 05:37 PM IST
Kannada star shivraj kumar hospitalised

కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ తాజాగా అనారోగ్యంతో హాస్పిటల్లో చేరారు. ఛాతినొప్పి బాధతో శివరాజ్ కుమార్ హాస్పిటల్లో చేరారు. ఆ తర్వాత శివరాజ్ కుమార్ ను మాల్య హాస్పిటల్ కు తరలించి, చికిత్స జరిపిస్తున్నారు.

అయితే ఈ విషయంపై శివరాజ్ కుమార్ బ్రదర్ రాఘవేంద్ర రాజ్ కుమార్ స్పందిస్తూ... శివన్న బాగున్నారు. వైద్యానికి సహకరిస్తున్నారు. రొటిన్ చెకప్ లు జరుగుతున్నాయి. కంగారుపడాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు.

శివరాజ్ కుమార్ గతకొద్ది రోజులుగా గుండె సమస్యతో బాధపడుతున్నాడని, ప్రస్తుతం హార్ట్ ఎటాక్ రావడం వల్లనే ఆయన హాస్పిటల్లో చేరారని వార్తలొచ్చాయి. కానీ ఈ వార్తలను వైద్యులు కూడా ఖండించారు. శివరాజ్ కు ఎలాంటి హార్ట్ కు సంబంధించిన సమస్యలు లేవని తెలిపారు. రెండు, మూడు రోజులు వైద్యుల పరిరక్షణలో వుంచుకొని, ఆ తర్వాత డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు.

శివరాజ్ కుమార్ కు కేవలం కన్నడంలోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వుంది. ఇప్పటికీ కూడా తన సినిమాలతో అభిమానులను అలరిస్తూ వున్నారు. శివరాజ్ కుమార్ బ్రదర్ పునీత్ రాజ్ కుమార్ కూడా కన్నడ పవర్ స్టార్ గా అశేష అభిమాన జనాన్ని సొంతం చేసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shivraj Kumar  Hospitalised  Movie News  Latest news  stills  

Other Articles