'ప్రిన్స్' మహేష్ బాబు మనస్సును ఓ సుకుమారి దోచింది. అదేంటి ఆతివళ మనస్సును దోచే రాజకుమారుడి మనస్సును దోచిన సుకుమారీ ఎవరా అంటూ ఆశ్చర్యపోతున్నారా..? సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న కుమారీ 21 ఎఫ్ చిత్రం టీజర్ ఆయన మనన్సును దోచేసింది. సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న కుమారి 21ఎఫ్ సినిమా టీజర్ తనకెంతో బాగా నచ్చిందంటూ మహేష్ ప్రశంసించాడు. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ పై ప్రశంసల జల్లు కురింపించాడు.
'కుమారి 21ఎఫ్ టీజర్ చాలా ఇంప్రెసివ్‌గా ఉందంటూ సామాజిక మాద్యమం ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు.. రత్నవేలు ఛాయాగ్రహణం, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం చాలా బాగున్నాయి. సుకుమార్ టీమ్ కు తన అభినందనలు తెలిపాడు. ఇతర హీరోలు, దర్శకుల సినిమాలను ప్రశంసిస్తూ తన పెద్ద మనసు చాటుకోవడం రాజకుమారుడికి అలవాటే అన్న వార్తలు కూడా వినబడుతున్నాయి. బాహుబలి రిలీజ్ సమయంలో తన సినిమాను వాయిదా వేసుకున్న ప్రిన్స్ అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల మనసు కూడా గెలుచుకున్నాడు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more