బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా పేరుగాంచిన అమీర్ ఖాన్ ప్రతిఒక్క విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు. ముఖ్యంగా తన సినిమా విషయంలో ఏ లోటుపాట్లు లేకుండా చూసుకోవడంలో తనకు తానే సాటి. పైగా.. అతగాడు ఎంచుకునే స్టోరీలు సైతం ఎంత బలంగా వుంటాయంటే.. నలుగురికి నిదర్శనంగా సదరు చిత్రం నిలిచిపోయింది. అందుకేనేమో.. అతని సినిమాలు ఇండియన్ హిస్టరీలోనే సరికొత్త రికార్డులు బద్దలు కొడతాయి. ఇక నటీనటుల ఎంపిక విషయంలోనూ అంతే! సదరు పాత్రకు ఎవరు సరిపోతారా? అనే విషయమై కొన్నిరోజులపాటు ఆలోచించి మరి నటులను తన సినిమాలో ఎంచుకుంటాడు ఈ హీరో. ఒకవేళ తనకు ఎవరైనా నచ్చకపోతే.. వెంటనే ఆడిషన్ సెట్స్ నుంచి వాళ్లను బయటికి పంపించేస్తాడు. ఇలా సెట్స్ నుంచి బయటపడ్డ వారి జాబితాల్లో ఇప్పుడు మల్లికా షెరావత్ కూడా చేరిపోయింది. ప్రపంచ అభిమానుల్నే తన అందచందాలతో మత్తెక్కించిన ఈ అమ్మడిని తన సెట్స్ నుంచి అమీర్ బయటకు పంపి దిమ్మతిరిగేలా చేశాడు. అంతే! అప్పటినుంచి ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది.
అసలు విషయం ఏమిటంటే.. ప్రస్తుతం అమీర్ నటిస్తున్న నటిస్తున్న కొత్త సినిమా ‘దంగల్’. మహవీర్ సింగ్ పొగట్ అనే రెజ్లర్ నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. పొగట్ తాను రెజ్లర్ కావడానికి పడ్డ కష్టాలు.. ఆ తర్వాత తన నలుగురు అమ్మాయిల్ని రెజ్లర్లుగా తీర్చిదిద్దడానికి చేసిన త్యాగాల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం 30 కిలోల దాకా బరువు పెరిగి 95 కిలోల దాకా చేరుకున్నాడు అమీర్. ఈ మధ్యే సినిమా మొదలైంది కూడా. ఇక ఈ సినిమాలో అమీర్ ఖాన్‌కు జోడీగా తొలుత మల్లికా శరారత్ను అనుకున్నారు. పైగా.. అమీర్ నిర్వహించిన ఆడిషన్ లోనూ ఈమె తన ప్రతిభ చాటుకుంది. దర్శకనిర్మాతల్ని తన అభినయంతో ఈ అమ్మడు ఆకట్టుకోగలిగింది. దాంతో ఈ అమ్మడే అమీర్ కి జోడిగా నటించనుందని వార్తలు వెలుగులోకి వచ్చాయి. కానీ.. ఇంతలోనే ఏమైందో ఏమో తెలీదుగానీ ఆ సినిమా నుంచి మల్లిక బయటికి వచ్చేసింది. చివరికి ఆమె స్థానంలో సాక్షి తన్వర్‌ను హీరోయిన్గా ఎంచుకున్నారు. ఐతే.. ఇంతకీ మల్లికను హీరోయిన్గా ఎందుకు తీసుకోలేదన్న దానిపై చాలా ఊహాగానాలు వచ్చాయి. వాటికి ఫుల్ స్టాప్ పెడుతూ.. తాజాగా మల్లి అసలు రీజన్ చెప్పింది.
‘'దంగల్ ఆడిషన్ కోసం దర్శకుడు నితీశ్ తివారి నన్ను పిలిచాడు. ఆడిషన్ బాగా జరిగింది. డైరెక్టర్‌తో పాటు అమీర్‌కు కూడా నా ఆడిషన్ నచ్చింది. కానీ ఈ సినిమాకు నేను సూటవ్వనని అమీర్ ఖాన్ తేల్చేశాడు. నా పాత్ర యంగ్‌గా కనిపించే వరకు ఓకే కానీ.. నలుగురు పిల్లల తల్లిగా, వయసు మీద అమ్మ పాత్రలో తాను సూటవ్వనని అమీర్ చెప్పాడట. ఇప్పటిదాకా తనను హాట్ హాట్ పాత్రల్లోనే చూసిన ప్రేక్షకులు తనని అమ్మ పాత్రలో చూసి జీర్ణించుకోలేరని అమీర్ ఖాన్ తేల్చి చెప్పేశాడు. ఆయన అలా అన్న తర్వాత హ్యాపీగా బయటికి వచ్చేశా'’ అని మల్లిక స్పష్టం చేసింది.
AS
(And get your daily news straight to your inbox)
Jul 06 | ప్రముఖ సినిమా ఎడిటర్ గౌతమ్ రాజు మృతిపట్ల సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. గౌతమ్ రాజు గారి లాంటి గొప్ప ఎడిటర్‌ను కోల్పోవడం దురదృష్టకరమని... Read more
Jul 06 | ప్రముఖ సినిమా ఎడిటర్ గౌతమ్‌రాజు కన్నుమూశారు. గత కొంకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. నగరంలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం డిశ్చార్జీ అయ్యారు. అయితే ఒక్కసారిగా... Read more
Jul 04 | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం గాడ్ ఫాదర్ గాడ్ ఫాదర్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం నుంచి మెగా ఫాన్స్ మాత్రమే కాకుండా... Read more
Jul 04 | నందమూరి హీరో కల్యాణ్‌రామ్ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం బింబిసార. మగధ రాజ్యాన్ని పరిపాలించిన హర్యాంక వంశస్థుడు బింబిసారుని జీవిత కథతో సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వశిష్ఠ్ దర్శకత్వం... Read more
Jul 04 | వాస్తవికతను ప్రతిబింబించే కథాంశాల్ని ఎంచుకుంటూ తెలుగు సినీరంగంలో హీరోగా వైవిధ్యతను చాటుకుంటున్నాడు శ్రీవిష్ణు. జయాపజయాలతో సంబంధంలేకుండా కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నాడు. ఫలితం ఎలా ఉన్నా ప్రేక్షకులకు కొత్త... Read more