Nithin Making Big Plans For Akhil Movie Promotions | Akhil Movie Shooting | Akkineni Akhil News

Akhil movie shooting complete nithin big plans for promotions

akhil movie news, akhil movie updates, akhil introduction song, akhil release updates, akhil release news, akhil movie news, akhil movie shooting, vv vinayak news, producer nithin, nithin latest news, sayesha saigal

Akhil Movie Shooting Complete Nithin Big Plans For Promotions : Akhil Movie Shooting Has Completed. Producer Nithin Has Make Big Plans For Promotions.

‘అఖిల్’ గ్రాండ్ ఎంట్రీకి.. నితిన్ భారీ ఖర్చు!

Posted: 09/24/2015 11:51 AM IST
Akhil movie shooting complete nithin big plans for promotions

‘అఖిల్’.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన పేరు. కమర్షియల్ డైరెక్టర్ వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ యంగ్ హీరో మొదటి సినిమా టైటిల్ కూడా ‘అఖిల్’ కావడంతో.. ఈ పేరు టాలీవుడ్ అంతటా మారుమోగిపోతోంది. అక్కినేని వంశం నుంచి మూడోతరంలో హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన ‘అఖిల్’ తొలిచిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ఐదు భారీ సెట్స్‌లో అఖిల్ ఇంట్రో సాంగ్ చిత్రీకరణతో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. దీంతో.. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో యూనిట్ మొత్తం నిమగ్నమైంది.

ఇక సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తవ్వడంతో.. టెక్నికల్ టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో మునిగిపోయింది. ఇక హీరో అఖిల్ కి ఇది మొదటి సినిమా కావడంతో భారీఎత్తున ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు.. ఇప్పటికే హైద్రాబాద్‌లో అఖిల్ ప్రమోషన్స్ సందడి మొదలవ్వగా... అఖిల్ స్వయంగా అమెరికా నుంచి మొదలుపెట్టి ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్నాడు. అక్టోబర్ 22న దసరా కానుకగా విడుదల కానున్న ఈ సినిమాకు ఇంకా నెలరోజుల సమయం వుంది. అందుకే.. ఈ సినిమా క్రేజ్ ను మరింత పెంచేందుకు హీరోతోపాటు దర్శకనిర్మాతలు ప్రమోషన్ పనుల్లో బిజీగా గడుపుతున్నారు. ముఖ్యంగా.. ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో నిర్మించిన నిర్మాత నితిన్.. భారీ ఎత్తున ప్రమోషనల్ కార్యక్రమాలకు ప్లాన్ రూపొందించాడని సమాచారం. యూనిట్ తోపాటు తాను స్వయంగా ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొననున్నాడని తెలిసింది.

కొన్ని ప్రదేశాల్లో ‘అఖిల్’ సినిమా ప్రమోషన్లలో భాగంగా భారీ పోస్టర్లు తయారు చేయించారని యూనిట్ చెబుతోంది. అలాగే.. ఈ ప్రమోషన్ లో భాగంగానే హీరోహీరోయిన్లు అభిమానులతో ముచ్చటించేలా ప్రత్యేకమైన వేదికలను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం ప్రమోషన్స్ కోసమే నితిన్ చాలా డబ్బు ఖర్చు పెట్టాడని చెప్పుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : akhil movie  akkineni akhil debut movie  vv vinayak  sayesha saigal  

Other Articles