Director Satyadeva Told Balakrishna Given Green Signal For Another Project Titled As Sarvabhouma | Tollywood News

Balakrishna new movie title sarvabhouma director satyadeva

balakrishna, balakrishna sarvabhouma movie, balakrishna movies, director satyadeva, satyadeva birthday, satyadeva press meet, balakrishna updates, balakrishna latest news, balakrishna gallery

Balakrishna New Movie Title Sarvabhouma Director Satyadeva : Director Satyadeva Told Balakrishna Given Green Signal For Another Project Titled As Sarvabhouma.

నటసింహుడి కొత్త ప్రాజెక్ట్ కి టైటిల్ ఫిక్స్

Posted: 09/19/2015 11:42 AM IST
Balakrishna new movie title sarvabhouma director satyadeva

‘డిక్టేటర్’ సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా వున్న నటసింహం బాలకృష్ణ.. ఆ తర్వాత 100వ సినిమా బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయనున్నారు. ఆ సినిమా స్ర్కిప్ట్ ఇంకా రెడీ కాకముందే.. మరో కొత్త ప్రాజెక్ట్ కి సంబంధించిన వార్తలు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్ ‘సార్వభౌమ’ అని తెలుస్తోంది. ఈ విషయాన్ని ‘లయన్’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సత్యదేవా వెల్లడించారు. తన దర్శకత్వంలో బాలయ్య మరో సినిమా చేయనున్నారని, ఆ చిత్రానికి ‘సార్వభౌమ’ అనే టైటిల్ పెట్టనున్నట్లు ఆయన తెలిపాడు.

సెప్టెంబర్ 19వ తేదీన డైరెక్టర్ సత్యదేవా పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన తన తాజా చిత్రానికి సంబంధించిన విశేషాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ పుట్టినరోజు నాకెంతో ప్రత్యేకం. దానికి కారణం బాలయ్యతో నేను చేసిన ‘లయన్’. 'లెజెండ్' వంటి హిట్ సినిమా చేసిన తర్వాత బాలయ్యగారు చేసిన చిత్రం ఇది. నా మీద నమ్మకంతో ఆయన ఈ అవకాశం ఇచ్చారు. ‘లయన్’లో తాను చేసిన గాడ్సే పాత్రను అభిమానులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని బాలయ్య నాతో అనడం ఆనందాన్నిచ్చింది. ఇక, ఈ పుట్టినరోజు నాకు మరో స్పెషల్ కూడా ఉంది. నా దర్శకత్వంలో బాలయ్య మరో సినిమా చేయనున్నారు. ఆయన కోసం ‘సార్వభౌమ’ కథను సిద్ధం చేసి వినిపిస్తే.. త్వరలో చేద్దామని చెప్పారు కూడా. ఆ సినిమా గురించి మరిన్ని విషయాలు బాలయ్యే స్వయంగా చెబుతారు’ అని చెప్పారు.

ఇదిలావుండగా.. ‘లయన్’ చిత్రం హిందీలో రీమేక్ కానుందని సత్యదేవా తెలిపారు. ఆ వివరాలు ఆయన వెల్లడిస్తూ.. ‘ఈ చిత్రం హిందీ రీమేక్ లో నటించడానికి అజయ్ దేవగన్ సుముఖంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన తండ్రి వీర్ దేవగన్ ‘లయన్’ చూశారు. చాలా ఇంటలెక్చువల్ మూవీ అని మెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆ చిత్రానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి’ అన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : director satyadeva  sarvabhouma movie title  balakrishna movies  

Other Articles