Rajinikanth | Kabali | First Look | Shooting | Radhika Apte | Dhansika | Stills | gallery

Super star rajinikanth kabali movie shooting started

Rajinikanth Kabali Movie Shooting starts, Rajinikanth Kabali Movie First Look, Rajinikanth next film title Kabali, Rajinikanth next Kabali, Rajinikanth as Kabali, Rajinikanth new movie Kabali, Rajinikanth Kabali movie news, Rajinikanth Kabali movie updates, Rajinikanth, Kabali, Rajinikanth movie news, Rajinikanth movie updates, Rajinikanth stills, Rajinikanth news, Rajinikanth stills

Super Star Rajinikanth Kabali Movie Shooting started: Tamil super star Rajinikanth next film title confirmed. Title is Kabali. Ranjith director. Radhika apte heroine, Dhansika acts in important role.

సూపర్ స్టార్ ‘కబలి’ షూటింగ్ ప్రారంభం

Posted: 09/18/2015 05:25 PM IST
Super star rajinikanth kabali movie shooting started

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించబోయే ‘కబలి’ చిత్ర షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే అభిమానులను పండగ సంధర్భంగా రజినీకాంత్ డబుల్ డోస్ బోనాంజాతో సంతోషం అందించారు.

అదేంటంటే... వినాయక చవితి సంధర్భంగా ‘కబలి’ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా నిన్న ఈ చిత్రానికి సంబంధించిన ముహూర్త కార్యక్రమాలను కూడా జరిపారు. అయితే నేటి నుంచి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభించారు. ఈ షూటింగ్ దాదాపు 3 నెలల పాటు జరుగనుంది.

మొదటి షెడ్యూల్ చెన్నైలో, తర్వాత షెడ్యూల్ మలేసియాలో ప్లాన్ చేసారు. ప్రముఖ దర్శకుడు రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కళైపులి ఎస్. థాను భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కబలీశ్వర్ అనే ఓ డాన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లుగా తెలిసింది.

బాలీవుడ్ హాట్ భామ రాధిక ఆప్టే హీరోయిన్ గా నటించనుంది. రజనీకాంత్ కూతురిగా ధన్సికను ఎంపిక చేసారు. తెలుగు, తమిళం భాషలలో ఏకకాలంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajinikanth  Kabali  First Look  Shooting  Radhika Apte  Dhansika  Stills  gallery  

Other Articles