Kamna Jethmalani | Srimukhi | Chandrika | Release Date | stills | trailers

Chandrika movie censor report

Chandrika Movie Release Date, Chandrika Movie Censor Report, Chandrika Movie stills, Chandrika Movie trailers, Chandrika Movie songs, Chandrika Movie posters, Chandrika Movie Latest Details, Chandrika Movie songs, Chandrika, Kamna Jethmalani, Srimukhi

Chandrika Movie Censor Report: Karthik Jayaram, Kamna Jethmalani, Srimukhi starrer is being produced by Mrs.V.Asha under Flying Wheels Productions Banner. Mr.Yogesh is the Director. horror drama entertainer "Chandrika" completed censor. Due to the horror elements it got "A" Certificate.

‘చంద్రిక’గా భయపెట్టడానికి వస్తున్న శ్రీముఖి

Posted: 09/15/2015 04:20 PM IST
Chandrika movie censor report

ఫ్లయింగ్‌ వీల్స్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై.. యోగేష్‌ దర్శకత్వంలో శ్రీమతి వి.ఆశ నిర్మిస్తున్న హర్రర్‌ డ్రామా ఎంటర్‌టైనర్‌ ‘చంద్రిక’. కార్తీక్‌ జయరామ్‌-కామ్న జెత్మలాని-శ్రీముఖి హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొంది. ఈ నెలాఖరుకు సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఫ్లయింగ్‌ వీల్స్‌ ప్రొడక్షన్స్‌ అధినేత్రి వి.ఆశ మాట్లాడుతూ... ‘మా దర్శకుడు యోగేష్‌ ‘చంద్రిక’ చిత్రాన్ని అత్యద్భుతంగా రూపొందించాడు. సాజిద్‌ ఖురేషి సమకూర్చిన కథ-స్క్రీన్‌ప్లే, అర్టిస్టు అభినయం, మా మ్యూజిక్‌ డైరెక్టర్‌ గున్వంత్‌సేన్‌ రీరికార్డింగ్‌తోపాటు గ్రాఫిక్స్‌ ‘చంద్రిక’ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి’ అన్నారు.

దర్శకుడు యోగేష్‌ మాట్లాడుతూ... ‘మా నిర్మాత ఆశ మేడమ్‌ మరియు ఈ చిత్రం కోసం పని చేసిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణులందరి సంపూర్ణ సహాయ సహకారాల వల్లే ‘చంద్రిక’ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకొనేలా రూపొందింది’ అన్నారు.

గిరీష్‌ కర్నాడ్‌, ఎల్‌.బి.శ్రీరాం, సత్యం రాజేష్‌ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కె.రాజేంద్రబాబు, సాహిత్యం: వనమాలి-కరుణాకర్‌ అడిగర్ల, సంగీతం: గున్వంత్‌సేన్‌, కథ-స్క్రీన్‌ప్లే: సాజిద్‌ ఖురేషి, నిర్మాత: వి.ఆశ, దర్శకత్వం: యోగేష్‌!!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kamna Jethmalani  Srimukhi  Chandrika  Release Date  stills  trailers  

Other Articles