Ram | Shivam Movie | Audio Teaser

Ram shivam movie audio teaser released

Shivam Movie Audio Teaser, Shivam Movie Latest Updates, Shivam Movie Release Date Confirmed, Shivam movie first look posters, Shivam movie songs shooting details, Shivam movie shooting details, Shivam movie news, Shivam movie details, Shivam movie stills, Shivam movie posters, Shivam movie first look, Ram Movie news, Ram stills, Ram movie updates, Ram Shivam

Ram Shivam Movie Audio Teaser Released: Tollywood Hero Ram upcoming film Shivam. Sravanthi ravikishore producer, Srinivas reddy direction. Rashi khanna heroine. Shivam movie first look posters released.

రామ్ ‘శివమ్’ ఆడియో టీజర్ విడుదల

Posted: 09/08/2015 09:37 AM IST
Ram shivam movie audio teaser released

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ గా పేరు దక్కించుకున్న హీరో రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘శివమ్’. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణచైతన్య సమర్పణలో స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీనివాస రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్ర ఆడియోను ఈ నెల 12వ తేదిన విడుదల చేయనున్నారు.

రామ్ సరసన రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే నార్వే, స్వీడన్ లోని పలు ప్రాంతాల్లో కొన్ని కీలక సన్నివేశాలు మరియు మూడు పాటలను చిత్రీకరించారు. మరో రెండు పాటలను హైదరాబాద్ లో జానీ మాస్టర్ నేతృత్వంలో చిత్రీకరించనున్నారు. ఈ వారం నుంచి హైదరాబాద్ లో షూటింగ్ ప్రారంభం కానుంది.

హై వోల్టేజ్ లవ్, యాక్షన్, కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. బ్రహ్మానందం, అభిమన్యుసింగ్, జయప్రకాశ్ రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రసూల్ ఎల్లోర్, యాక్షన్: పీటర్ హెయిన్స్.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram  Shivam  Teaser  Release Date  posters  movie news  stills  

Other Articles