Anushka | Size Zero | Movie Audio

Anushka size zero movie audio release postponed

Anushka Size Zero Audio Release Postponed, Anushka Size Zero Audio Release Date, Anushka Size Zero Latest Posters, Anushka Size Zero Second Look Poster, Anushka Size Zero Second Look, Anushka Size Zero Second Look Stills, Size Zero Second Look Poster, Anushka Size Zero Title Logo, Anushka Size Zero movie news, Anushka Size Zero movie updates, Anushka Size Zero stills, Anushka Size Zero, Anushka, Size Zero

Anushka Size Zero Movie Audio Release Postponed: Starring Arya, Anushka Shetty, Sonal Chauhan, Prakash Raj, Urvashi, Bharat and others, Size Zero is all set for a global release on OCTOBER 2nd, 2015, on the occasion of Gandhi Jayanthi.

అనుష్క ‘సైజ్ జీరో’ ఆడియో వాయిదా!

Posted: 09/07/2015 11:00 AM IST
Anushka size zero movie audio release postponed

ఈ మధ్య అనుష్క నటిస్తున్న సినిమాలన్నీ కూడా వాయిదాలు పడుతూ వస్తున్నాయి. గతంలో అనుష్క నటించిన ‘బాహుబలి’ సినిమా కూడా చాలా కాలం విడుదల కాకుండా పలు రకాల కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అలాగే ‘రుద్రమదేవి’ సినిమా కూడా గతకొద్ది కాలంగా వాయిదాలు పడుతూ వస్తున్న విషయం తెలిసిందే.

అయితే తాజాగా అనుష్క నటిస్తున్న ‘సైజ్ జీరో’ చిత్రం కూడా అదే ధోరణిలో వున్నట్లుగా కనిపిస్తుంది. అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సైజ్ జీరో’. ప్రముఖ దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ చిత్రాల సంస్థ PVP బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ప్రసాద్ వి. పోట్లూరి నిర్మిస్తున్నారు.

యం.యం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను సెప్టెంబర్ 6న విడుదల చేయాలని అనుకున్నారు. కాని పలు కారణాల వల్ల ఈ చిత్ర ఆడియో విడుదలను వాయిదా వేసారు. త్వరలోనే ఆడియో రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించనున్నారు.



ఇందులో అనుష్క సరసన ఆర్య హీరోగా నటిస్తున్నాడు. సోనాల్ చౌహన్ కీలక పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాపై వున్న అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి. ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఈ చిత్రానికి సంగీతం: యం.యం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: నిరవ్ షా, ఆర్ట్: ఆనంద్ సాయి, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, కాస్ట్యూమ్స్: ప్రశాంత్, కథ-స్క్రీన్ ప్లే: కణిక థిల్లాన్ కోవెలమూడి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సందీప్ గుణ్ణం, నిర్మాత: ప్రసాద్ వి.పొట్లూరి, దర్శకత్వం: ప్రకాష్ కోవెలమూడి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anushka  Size Zero  Audio Release Postponed  Movie News  Arya  

Other Articles