Rs 10 lakh fine | Ram Gopal Varma

Rs 10 lakh fine on ram gopal varma

Rs 10 lakh fine on RGV for Sholay remake, RGV fined, RGV 10 lakhs, RGV sholay remake, RGV latest news, RGV aag film, RGV HC news, RGV court issue, RGV Sholay news, RGV news, RGV tweets, RGV

Rs 10 lakh fine on Ram Gopal Varma: The Delhi High Court has slapped a Rs.10 lakh fine on filmmaker Ram Gopal Varma for remaking 1975 blockbuster Sholay.

అగ్గి తీసి పదిలక్షలు బుగ్గిపాలు చేసుకున్న వర్మ

Posted: 09/01/2015 11:33 AM IST
Rs 10 lakh fine on ram gopal varma

హిందీలో వచ్చిన ‘షోలే’ చిత్రం ఇప్పటికి కూడా ఓ అద్భుత చిత్రంగా భావిస్తారు. అలాంటి ఈ చిత్రం ఎన్నో రికార్డులను క్రియేట్ చేయడమే కాకుండా పలు చిత్రాలకు ఆదర్శంగా చెప్పుకోవచ్చు. ‘షోలే’ తర్వాత ఇదే తరహాలో చాలా చిత్రాలొచ్చాయి. కానీ ‘షోలే’ వలే ఏ సినిమా కూడా అంతగా విజయం సాధించలేకపోయాయి.

అయితే దర్శకుడు రాంగోపాల్ వర్మ మాత్రం ఈ సినిమాను ‘ఆగ్’ పేరుతో (తెలుగులో ‘అగ్గి’) 2007లో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ‘షోలే’ లో హీరోగా నటించిన అమితాబ్ బచ్చన్ ను ‘ఆగ్’ సినిమాలో ‘గబ్బర్ సింగ్’ గా విలన్ పాత్రలో చూపించాడు వర్మ. అయితే ‘ఆగ్’ సినిమా విడుదలై అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కానీ ఈ సినిమాపై ‘షోలే’ అభిమానులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

‘షోలే’ వంటి ఓ క్లాసికల్ హిట్ చిత్రాన్ని రీమేక్ చేసి వర్మ అట్టర్ ఫ్లాప్ చేసారంటూ అభిమానులు మండిపడుతున్నారు. అంతే కాకుండా తాజాగా వర్మపై ఢిల్లీ హైకోర్టు కూడా వర్మకు భారీ మొత్తంలో జరిమానా విధించింది. ‘షోలే’ చిత్ర నిర్మాతల మనవడు సస్చాసిప్పీ ఈ సినిమా కాపీరైట్ యాక్ట్ కింద వర్మపై కేసు నమోదు చేసారు.

తాజాగా ఈ విషయంపై కోర్టు తీర్పును ప్రకటిస్తూ పదిలక్షల రూపాయల జరిమానా విధించింది. చిత్ర నిర్మాతల అనుమతి తీసుకోకుండా సినిమాకు సంబంధించిన సన్నివేశాలు, పాత్రలు, నేపథ్య సంగీతం వాడుకున్నందుకు వర్మకు కోర్టు భారీగా జరిమానా విధించింది. ఇందులో వర్మతో పాటు ‘ఆగ్’ సినిమా నిర్మాతలు కూడా దోషులుగా వున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RGV  10 lakhs  fine  Sholay  Remake  Aag movie  tweets  

Other Articles