Ram Charan | BruceLee Movie | Shooting Details

Ram charan brucelee movie shooting details

Ram Charan BruceLee First Look Official Teaser, Ram Charan BruceLee Stills, Ram Charan BruceLee Movie Shooting in hyderabad, Ram Charan upcoming film BruceLee, Ram Charan BruceLee movie news, Ram Charan BruceLee movie updates, Ram Charan BruceLee film news, Ram Charan BruceLee movie stills, Ram Charan latest news, Ram Charan latest updates, Ram Charan

Ram Charan BruceLee Movie Shooting Details: The Official BruceLee The Fighter Teaser, stars Ram Charan, Rakul Preet & Chiranjeevi, is directed by Srinu Vaitla, produced by DVV Danayya and Music By Thaman.

శరవేగంగా చెర్రీ ‘బ్రూస్ లీ’ షూటింగ్

Posted: 09/01/2015 10:36 AM IST
Ram charan brucelee movie shooting details

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రూస్ లీ’. ప్రముఖ కమర్షియల్ ఎంటర్ టైనర్ చిత్రాల దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి.’ పతాకం పై శ్రీమతి డి. పార్వతి సమర్పణలో హిట్ చిత్రాల నిర్మాత దానయ్య డి.వి.వి నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఇందులో చరణ్ లుక్స్ సింప్లీ సూపర్బ్. స్టైలిష్ మాస్ లుక్ లో అదరగొట్టాడు. విజువల్స్ పరంగా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. చరణ్ ఇందులో చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్లలో కుమ్మేసాడని అర్థమవుతుంది.

ఇందులో చెర్రీ చెప్పిన డైలాగ్స్ కు మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ‘నీ మీటర్ పగిలితేగానీ నా మీటర్ అర్థంకాదు’ అంటూ చెర్రీ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. చరణ్ ఓ స్టంట్ మాస్టర్ పాత్రలో కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్ర షూటింగ్ దాదాపు 80% పూర్తి చేసుకున్నట్లుగా తెలిసింది. టీజర్ విడుదలయ్యాక ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.



ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ‘బ్రూస్ లీ’గా రాబోతున్న ఈ సినిమాపై మెగా అభిమానులు ధీమాగా వున్నారు. ఈ సినిమా ఎలాగైనా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో వున్నారు. రాంచరణ్ సరసన తొలిసారిగా రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా జతకడుతుంది.

ఈ చిత్రానికి కథ : కోన వెంకట్, గోపి మోహన్, మాటలు: కోన వెంకట్, రచనా సహకారం: ఉపేంద్ర మాధవ్, ప్రవీణ్; లైన్ ప్రొడ్యూసర్ : కృష్ణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి. వై. ప్రవీణ్ కుమార్, సమర్పణ : డి. పార్వతి, నిర్మాత : దానయ్య డి.వి.వి, దర్శకత్వం: శ్రీనువైట్ల.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  BruceLee  Teaser  Stills  Rakul preet singh  Srinu Vaitla  Movie News  stills  

Other Articles