Rajamouli Says He Is The Boss Than His Father Vijayendra Prasad In Professional Life | Bahubali Records

Rajamouli says he is the boss than his father vijayendra prasad in professional life

rajamouli, director rajamouli news, rajamouli latest updates, forbes magazine, vijayendra prasad, bahubali movie

Rajamouli Boss Bahubali Movie Vijayendra Prasad Forbes Magazine : Rajamouli Says He Is The Boss Than His Father Vijayendra Prasad In Professional Life.

‘తండ్రీకొడుకులు అయితేనేం.. ‘బాస్’ నేనే’!

Posted: 08/29/2015 05:51 PM IST
Rajamouli says he is the boss than his father vijayendra prasad in professional life

ఒక రాజ్యంలో ఎంతోమంది సైనికులు, సైనికాధికారులు, ఇతర బలగాలు, మహామంత్రి వున్నప్పటికీ.. దానికి రాజే అధిపతి! అతడి మాటే శాసనం! అతను తీసుకున్న నిర్ణయాలు జరగాల్సిందే! అది.. పొరుగురాజ్యంపై దండయాత్రైనా, పన్నులు-పరిహారాల విషయమైనా, బహుమతులు అందజేయడంలోనైనా.. ఇలా రాజ్యంలో ఏం చేయాలన్న ఆయనదే అంతిమ నిర్ణయం. తెలుగు సినీ విశ్వవినీలాకాశంలో తనదైన ముద్ర వేసుకుని ప్రపంచస్థాయిలో మన్ననలు అందుకున్న దర్శకధీరుడు రాజమౌళి.. ఇప్పుడు తనకుతానే రాజుగా ప్రకటించుకున్నాడు.

రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ చిత్రం.. విడుదలైన అన్ని భాషలోను, ప్రాంతంలోనూ సంచలన విజయాన్ని సాధించింది. 50 రోజుల మైలురాయిని కూడా దాటేసింది. ఈ సందర్భంగా ‘ఫోర్బ్స్’ మేగజైన్ రాజమౌళి ఇంటర్వ్యూని ప్రచురించింది. అందులో భాగంగానే రాజమౌళి తననుతాను ‘బాస్’గా ప్రకటించుకున్నాడు. ‘బాహుబలి’ సినిమాకి రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందించిన విషయం తెలిసిందే. అందువల్ల కథా చర్చల సమయంలో.. ఇద్దరిలో ఎవరు ‘బాస్’గా వ్యవహరిస్తారని ఈ పత్రిక జక్కన్నను ప్రశ్నించింది. అందుకు జవాబుగా ఆయన తనదైన శైలిలో స్పందించాడు.

కథలోని అన్ని అంశాలు సమపాళ్లలో ఉండేలా చూసుకునేది దర్శకుడు కాబట్టి అతనే బాస్ అని రాజమౌళి చెప్పాడు. తన సినిమాకి తానే బాస్ ననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. తాము తండ్రీకొడుకులమే అయినా, పని విషయంలో చాలా ప్రొఫెషనల్ గా ఉంటామని స్పష్టం చేశాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajamouli  bahubali movie  vijayendra prasad  forbes magazine  

Other Articles