The First Look Of Naga Chaitanya Latest Flick Sahasame Swasaga Sagipo Has Released | Gautham Vasudev Menon

Naga chaitanya sahasame swasaga sagipo movie first look release gautham vasudev menon

naga chaitanya, sahasame Swasaga sagipo first look, sahasame Swasaga sagipo movie news, sahasame Swasaga sagipo updates, naga chaitanya movie updates, gautham vasudev menon, naga chaitanya gautham menon movie, actress manjima mehan

Naga Chaitanya Sahasame Swasaga Sagipo Movie First Look Release Gautham Vasudev Menon : The First Look Of Naga Chaitanya Latest Flick Sahasame Swasaga Sagipo Has Released In The Occasion Of Nagarjuna's Birthday. This Movie Directed By Gautham Vasudev Menon.

‘సాహసమే శ్వాసగా సాగిపో’ ఫస్ట్ లుక్ రిలీజ్

Posted: 08/29/2015 01:13 PM IST
Naga chaitanya sahasame swasaga sagipo movie first look release gautham vasudev menon

టాలీవుడ్ లవర్ బాయ్ గా పేరొందిన అక్కినేని నాగచైతన్య హీరోగా ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ‘సాహసమే శ్వాసగా సాగిపో’ అనే టైటిల్ ని ఇప్పటికే ఖరారు చేశారు. ఇప్పుడు తాజాగా అక్కినేని నాగార్జున బర్త్ డే సందర్భంగా మూవీ ఫస్ట్ లుక్ ని  విడుదల చేశారు. నాగచైతన్య కనిపించని ఈ పోస్టర్ లో కేవలం ఒక బైక్, దాని హ్యాండిల్ కి హల్మెట్, బ్యాక్ డ్రాప్ లో ఎడారి లొకేషన్, దాని పొడవున నిర్మానుష్యమైన రహదారి, అలాగే దూరంగా కనిపిస్తున్న కారు, టైటిల్ లోగో మాత్రమే వున్నాయి. త్వరలోనే చైతూ వున్న పోస్టర్ ను విడుదల చేయనున్నారు.

గతంలో వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన ‘ఏమాయ చేసావే’ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ చిత్రాన్ని దర్శకుడు తమిళంలోనూ శింబు హీరోగా తెరకెక్కించారు. ఆ చిత్రాన్ని ఏకకాలంలో విడుదల చేశారు. ఇప్పుడు తాజాగా రూపొందుతున్న ‘సాహసమే శ్వాసగా సాగిపో’ చిత్రాన్ని కూడా దర్శకుడు గౌతమ్ మీనన్ తమిళంలో శింబుతో, తెలుగులో నాగచైతన్యతో తీస్తున్నారు. అయితే.. ఈసారి వీరిద్దరి సరసన మలయాళీ భామ మంజిమ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో ఈ చిత్రాన్ని ప్రముఖ రచయిత కోన వెంకట్ భారీ వ్యయంతోనే నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలు అధికారికంగా వెలువడి కానున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : naga chaitanya  sahasame Swasaga sagipo  gautham vasudev menon  

Other Articles