Pawan kalyan Romance with Kajal in Sardaar Gabbarsingh

Pawan kalyan romance with kajal in sardaar gabbarsingh

Pawan kalyan Romance with Kajal, Pawan kalyan Sardaar Gabbar singh First Look Poster, Pawan kalyan First Look Poster, Pawan kalyan Sardaar Gabbar singh First Look, Pawan kalyan title Sardaar Gabbar singh, Pawan kalyan Sardaar Gabbar singh Poster, Sardaar Gabbar singh movie first look, Sardaar Gabbar singh poster, Sardaar Gabbar singh movie posters, Sardaar Gabbar singh, Pawan Kalyan movie news, Pawan Kalyan latest stills, Pawan Kalyan latest posters, Pawan Kalyan

Pawan kalyan Romance with Kajal in Sardaar Gabbarsingh: Power star pawan kalyan upcoming film Sardaar Gabbar singh. bobby director, devi sri prasad music. Pawan kalyan movie shooting updates and details.

పవర్ స్టార్ సర్దార్ కు కత్తిలాంటి హీరోయిన్ ఖరారు

Posted: 08/24/2015 12:51 PM IST
Pawan kalyan romance with kajal in sardaar gabbarsingh

‘అత్తారింటికి దారేది’ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ‘పవర్’ ఫేం దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత శరత్ మరార్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ముందుగా అనీషా అంబ్రోస్ ను అనుకున్నారు. కానీ షూటింగ్ స్టార్ట్ అయ్యాక అనీషాను ఈ ప్రాజెక్టును నుంచి తప్పించినట్లుగా తెలిసింది. హీరోయిన్ గా పలు టాప్ స్టార్ భామల పేర్లు వినిపించాయి. సమంత, కాజల్, తమన్నా... ఇలా పలు భామల పేర్లు వినిపించాయి.

మొన్నటివరకు సమంతను ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు కూడా వార్తలొచ్చాయి. కానీ అవన్నీ కేవలం పుకార్లేనని తేలిపోయింది. ఇందులో పవన్ సరసన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ను ఖరారు చేసారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించారు.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. అభిమానులు చాలా సంతోషంగా వున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan kalyan  Sardaar Gabbar singh  Kajal  First Look Poster  Stills  

Other Articles