జనసేనాధిపతి-పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవి మధ్య విభేదాలున్నాయని గతకొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే! తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని పలు సందర్భాల్లో మెగా ఫ్యామిలీ మెంబర్స్ వివరణ ఇచ్చినప్పటికీ.. విభేదాల ప్రచారం మాత్రం కొనసాగుతూనే వచ్చింది. ఇక చిరంజీవి 60వ బర్త్ డే సందర్భంగా శుక్రవారం అభిమానుల కోసం హైదరాబాద్ లోని శిల్పాకళావేదికలో నిర్వహించిన గ్రాండ్ పార్టీకి పవన్ హాజరు కాకపోవడంపై ఆ అనుమానాలు మరింత బలపడ్డాయి. ఆ వేడుకల్లో పవన్ కనిపించకపోవడంతో పవర్ స్టార్ కావాలంటూ అభిమానులు గోల చేయగా.. నాగబాబు మొట్టికాయలేసారు. ‘వాడిని ఎన్నిసార్లు పిలిచినా రావడం లేదు. దానికి మేము ఏం చేస్తాం’ అని మండిపడటంతో.. చిరు-పవన్ మధ్య విబేధాలున్నాయనే వార్తలు మరింత బలంగా వీచాయి.
అయితే ఈ వార్తలను తెరదించుతూ పవన్ కల్యాణ్ తన అన్నయ్య చిరంజీవిని కలవడానికి శనివారం నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా చిరంజీవికి పవన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. చాలాకాలం తర్వాత అన్నయ్య ఇంటికెళ్లిన పవన్.. కుటుంబ సభ్యులతో దాదాపు 50 నిముషాల వరకు గడిపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పార్క్‌హయత్ హోటల్ లో నిర్వహించనున్న చిరు బర్త్ డే గ్రాండ్ ఈవెంట్ కి పవన్ కూడా వెళ్లనున్నట్లు సమాచారం. ఏదేమైనా.. పవన్ నేరుగా చిరు ఇంటికే వెళ్లి ఆయనతో ముచ్చటించడంతో వారి మధ్య విభేదాలు లేవని స్పష్టం అవుతోంది. మరోవైపు.. వీరిద్దరు చాలాకాలం తర్వాత కలడవంపై మెగాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా.. చిరు పుట్టినరోజు సందర్భంగా పార్క్ హయాత్ హోటల్ కు బాలీవుడ్ తో పాటు దక్షిణాది సినీ పరిశ్రమల నుండి పలువురు ప్రముఖులు హాజరు కాబోతున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more