Ravi Teja | Bengal Tiger | Nizam Rights sold | Rashi khanna | Tamanna | Movie News

Global cinemas bags nizam rights of ravi teja bengal tiger

Global Cinemas Bags Nizam Rights of Bengal Tiger, Bengal Tiger Movie Latest Updates, Bengal Tiger Movie News, Bengal Tiger Movie Shooting Updates, Bengal Tiger Movie Details, Raviteja Movie news, Raviteja movie updates, Raviteja latest news, Raviteja movies, Raviteja movie stills, Raviteja

Global Cinemas Bags Nizam Rights of Ravi Teja Bengal Tiger: Mass Maharaja Raviteja upcoming film Bengal Tiger. This movie Nizam rights have been sold. Global Cinemas bagged the Nizam distribution rights of the much awaited movie. Sampath Nandi direction, KK Radhamohan producer. Tamanna, Rashi khanna heroines.

గ్లోబల్ చేతికి బెంగాల్ టైగర్ నైజాం హక్కులు

Posted: 08/18/2015 10:18 AM IST
Global cinemas bags nizam rights of ravi teja bengal tiger

మాస్ మహరాజ్‌ రవితేజ హీరోగా, త‌మ‌న్నా, రాశి ఖ‌న్నా హీరోయిన్స్ గా, సంపత్ నంది దర్శకత్వంలో చేస్తున్న 'బెంగాల్ టైగ‌ర్' చిత్రానికి సంబందించి షూటింగ్ చివ‌రి ద‌శ‌లో వుంది. ప్రేక్షకాద‌ర‌ణ వున్న చిత్రాల్ని నిర్మించిన‌ కె కె రాధామోహన్ నిర్మాత‌. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్లో ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'బ‌లుపు',' ప‌వ‌ర్' చిత్రాల త‌రువాత ర‌వితేజ‌, ర‌చ్చ చిత్రం త‌రువాత సంప‌త్ నంది కాంబినేష‌న్ లో 'బెంగాల్ టైగ‌ర్' చిత్రం వ‌స్తుండ‌టంతో బిజినెస్ వ‌ర్గాల్లో హ్యుజ్‌ క్రేజ్ వ‌చ్చింది. నైజాం లో అత్తారింటికి దారేది , రేసుగుర్రం లాంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రాల్ని పంపిణి చేసిన గ్లోబ‌ల్ సినిమాస్ వారు ఇప్పడు మాస్‌మ‌హ‌రాజ్ ర‌వితేజ బెంగాల్ టైగ‌ర్ చిత్రం హ‌క్కుల‌ను సొంతం చేసుకున్నారు.

నిర్మాత కె కె రాధామోహన్ మాట్లాడుతూ" మా బ్యాన‌ర్ లో మాస్‌మ‌హ‌రాజ్‌ ర‌వితేజ , త‌మ‌న్నా, రాశిఖ‌న్నా లు జంట‌గా తెరకెక్కిస్తున్న 'బెంగాల్ టైగర్' చిత్రం షూటింగ్ ఎటువంటి ఆటంకాలు లేకుండా శరవేగంగా జరుగుతోంది. బిజినెస్ స‌ర్కిల్ లో కూడా ప్రత్యేక‌మైన క్రేజ్ వుండ‌టం చాలా హ్యపిగా వుంది. నైజాంలో అత్తారింటికి దారేది , రేసుగుర్రం లాంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రాల్ని పంపిణి చేసిన గ్లోబ‌ల్ సినిమాస్ వారు మా బెంగాల్ టైగ‌ర్ ని నైజాంలో పంపిణి హ‌క్కులు పొందారు. మా బెంగాల్ టైగ‌ర్ అన్ని వ‌ర్గాల ప్రేక్షకుల్ని ఆక‌ట్టుకుంటుంది. అని అన్నారు

ఈ చిత్రంలో మాస్‌మ‌హ‌రాజ్ ర‌వితేజ‌, త‌మ‌న్నా, రాశిఖ‌న్నా, బోమ‌న్ ఇరాని, బ్రహ్మనందం, రావు ర‌మేష్‌, షియాజి షిండే, నాజ‌ర్‌, పోసాని కృష్ణముర‌ళి, త‌నికెళ్ళ భ‌ర‌ణి, హ‌ర్హవ‌ర్ధన్ రానే, పృద్వి, సురేఖ వాణి, అక్ష‌, శ్యామ‌ల‌, ప్రియ‌, ప్రభు, ప్రగ‌తి, నాగినీడు, ప్రభ‌, ర‌మాప్రభ తదిత‌రులు నటిస్తున్నారు.

బ్యాన‌ర్‌ : శ్రీ స‌త్యసాయి ఆర్ట్స్‌, కెమెరా: సౌంద‌ర్ రాజ‌న్‌, ఎడిట‌ర్‌: గౌత‌ం రాజు, ఆర్ట్‌: డి,వై.స‌త్యనారాయ‌ణ‌, ఫైట్స్‌: రామ్‌-ల‌క్ష్మణ్‌, సంగీతం భీమ్స్‌, నిర్మాత‌: కె.కె.రాధామెహ‌న్‌, క‌థ‌-మాట‌లు-స్ర్కీన్‌ప్లే-ద‌ర్శకత్వం: సంప‌త్ నంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravi Teja  Bengal Tiger  Nizam Rights sold  Rashi khanna  Tamanna  Movie News  

Other Articles