Akkineni Nagarjuna wants Ravanasura role

Akkineni nagarjuna wants ravanasura role

Akkineni Nagarjuna dream role, Akkineni Nagarjuna wants ravanasura role, Akkineni Nagarjuna latest news, Akkineni Nagarjuna movie news, Akkineni Nagarjuna latest updates, Akkineni Nagarjuna movie details, Akkineni Nagarjuna stills, Akkineni Nagarjuna

Akkineni Nagarjuna wants Ravanasura role: Tollywood hero king akkineni nagarjuna talks about his dream role. nagarjuna wants to do Ravanasura role.

రావణాసురుడి పాత్రలో నటించాలనుంది: కింగ్ నాగార్జున

Posted: 08/12/2015 04:10 PM IST
Akkineni nagarjuna wants ravanasura role

తెలుగులో ఒకప్పుడు వరుస రొమాంటిక్, యాక్షన్ చిత్రాల్లో నటించిన కింగ్ అక్కినేని నాగార్జున... ఆ తర్వాత భక్తిరస చిత్రాల్లో నటించాడు. అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడిసాయి వంటి పలు భక్తిరస చిత్రాలలో కూడా నటించి మెప్పించాడు. వరుసగా కమర్షియల్ చేసి చేసి బోర్ ఫీలయ్యడో ఏమో కానీ.. నాగ్ కొత్త రకం కథలను, విభిన్న చిత్రాలపై దృష్టిపెడుతున్నాడు.

తాజాగా తనకు రామాయణంలోని రావణాసురుడి పాత్రలో నటించాలనుందంటూ తన కోరికను బయటపెట్టేసాడు. ఇటీవలే ఓ కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జున మాట్లాడుతూ.. తనకు చిన్నప్పటి నుంచి పౌరణిక, జానపద చిత్రాలంటే ఇష్టమని.. అలాంటి సినిమాలో నటించాలని వుందని తెలిపాడు. అంతేకాకుండా రామాయణంలోని రావణాసురుడి పాత్రలో నటించాలని వుందంటూ తన కోరికను బయటపెట్టాడు.

నాగార్జున ద్విపాత్రాభినయంలో నటించిన ‘సొగ్గాడే చిన్నినాయన’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే నాగార్జున, కార్తీ, తమన్నా ప్రధాన పాత్రలలో కలిసి నటిస్తున్న చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akkineni Nagarjuna  Ravanasura role  Soggade chinni nayana  movie news  stills  

Other Articles