Junior Ntr To Do Kaththi Telugu Remake | Tollywood Gossips | Vijay Kaththi Movie

Junior ntr kaththi telugu remake farmers problems tollywood gossips

junior ntr, kaththi remake, vijay kaththi movie, junior ntr new movie, junior ntr gossips, junior ntr updates, junior ntr beard, junior ntr with sukumar, director murugadoss, director gopichand malineni, junior ntr with rakul preet singh, samantha, actor vijay

Junior Ntr Kaththi Telugu Remake Farmers Problems Tollywood Gossips : According to the tollywood news junior ntr has given green signal to act in vijay's kaththi remake.

రైతుల కోసం ‘కత్తి’ పట్టుకోనున్న ఎన్టీఆర్..?

Posted: 08/04/2015 06:22 PM IST
Junior ntr kaththi telugu remake farmers problems tollywood gossips

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ట్రెండ్ కి తగ్గట్టు తనన తాను మార్చుకుంటూ వస్తున్నాడు. గతంలో ఎన్నడూలేని విధంగా సరికొత్త రూపంలో కనువిందు చేసిన ఈ హీరో.. ఇప్పుడు రైతులకోసం ‘కత్తి’ పట్టుకోవడానికి సిద్ధంగా వున్నాడని సమాచారం. రైతులపై జరుగుతున్న అన్యాయాలను ఎండగట్టేందుకు వీరోచిత వీరుడిలా పోరాడేందుకు అతగాడు సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది. అయితే.. ఇదంతా నిజజీవితంలో కాదులెండి.. రీల్ లైఫ్ లో!

వివరాల్లోకి వెళ్తే.. కోలీవుడ్ విలక్షణ దర్శకుడు మురుగదాస్, తమిళ సూపర్ స్టార్ ఇళయథలపతి విజయ్ కాంబినేషన్‌లో రూపొందిన ‘కత్తి’ చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే! రైతుల సమస్యల్ని ఎలా తీర్చాలోనన్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం.. అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు పొందడమే కాకుండా.. హీరో విజయ్ కి మంచి మార్కులే పడ్డాయి. అంతేకాదు.. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించి, వందకోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. దీంతో ఈ సినిమాను తెలుగులోకి రీమేక్ చేయాలని భావించారు. ఈ నేపథ్యంలో పలువురు పెద్ద హీరోలు ఈ చిత్రం రీమేక్ పై ఆసక్తి కనబరిచారు. కానీ.. అవన్నీ చర్చల దశల్లోనే ఆగిపోయి పట్టాలెక్కలేదు. ఈ క్రమంలోనే ఈ చిత్రం కూడా ‘జిల్లా’ సినిమాలాగే తెలుగులో డబ్ వర్షనే రిలీజ్ అవుతుందని అనుకున్నారు. ఆ మధ్య ‘కత్తి’ చిత్రం తెలుగులో రీమేక్ కానుందని ప్రచారం కూడా జరిగింది. కానీ.. ఇప్పుడు ఆ ప్రచారాలకు వ్యతిరేకంగా ఓ ఆసక్తికరమైన వార్త వెలువడింది. ఈ సినిమా డబ్ వెర్షన్ లో కాకుండా రీమేక్ కానుందని ఫిలింనగర్ లో చర్చించుకుంటున్నారు.

ఈ ‘కత్తి’ సినిమా రీమేక్ లో నటించేందుకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సిద్ధమైపోయారని సమాచారం. ‘బలుపు’, ‘పండగ చేస్కో’ లాంటి సినిమాలతో హిట్ అందుకున్న దర్శకుడు గోపిచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. గోపీచంద్, దర్శకుడు మురుగదాస్ వద్ద గతంలో అసిస్టెంట్‌గా చేశారు. ఇక తెలుగు వర్షన్ కోసం స్వయంగా మురుగదాసే స్క్రీన్‌ప్లేలో మార్పులు చేయనున్నారట. ప్రస్తుతం ఎన్టీఆర్ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే! అది పూర్తి కాగానే ‘కత్తి’ రీమేక్ సెట్స్‌పైకి వెళ్ళనుంది. అయితే.. ఇందుకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : junior ntr  kaththi remake  actor vijay  

Other Articles