చుల్ బులీ భామ సమంత త్వరలోనే తమిళ సంగీత దర్శకుడు జివి ప్రకాశ్ కుమార్ తో జతకట్టనుందని వార్తలొస్తున్నాయి. జీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రూస్ లీ’. ఇటీవలే ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ కు భారీ రెస్పాన్స్ వస్తుంది. కెనన్య ఫిలింస్ బ్యానర్ పై సెల్వకుమార్.జె సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ పాండియరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రంలో సమంత నటించనుందని సమాచారం. ఈ సినిమా కోసం చిత్ర దర్శకనిర్మాతలు సమంతను సంప్రదిస్తున్నట్లుగా తెలిసింది. ఈ ప్రాజెక్టు పట్ల సమంత ఆసక్తి చూపుతున్నప్పటికీ, ఇంకా ఈ ప్రాజెక్టుకు సమంతకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.
ప్రస్తుతం జివి నటించిన ‘త్రిష ఇల్లానా నయనతార’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని ‘త్రిష లేదా నయనతార’ పేరుతో విడుదల చేయనున్నారు. ఈ చిత్రం మరికొద్ది రోజుల్లోనే తెలుగు, తమిళం భాషలలో విడుదల చేయనున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more