Nani Jai Balayya movie latest shooting details

Nani jai balayya movie latest shooting details

Nani Jai Balayya movie shooting updates, Nani next film title Jai Balayya, Nani new movie launched, Nani movie launched, Nani 14 reels movie launch, Nani new movie launch stills, Nani movie updates, Nani movie stills, Nani movie news, Nani

Nani Jai Balayya movie latest shooting details: Nani upcoming film under Hanu Raghavapudi direction. 14 Reels Entertainments Banner. Movie Shooting in Ananthapoor dist.

అనంతపూర్ లో మళ్లీ మొదలైన నాని ‘జై బాలయ్య’

Posted: 07/29/2015 05:16 PM IST
Nani jai balayya movie latest shooting details

మారుతి దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కుతున్న ‘భలే భలే మగాడివోయ్’ చిత్ర షూటింగ్ మొత్తం ఇటీవలే పూర్తయిన విషయం తెలిసిందే. నాని, లావణ్య త్రిపాఠీ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని బన్నీవాసు నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తవడంతో నాని తన తర్వాత చిత్ర షూటింగ్ లో పాల్గొంటూ బిజీ అయ్యాడు.

‘భలే భలే మగాడివోయ్’ తర్వాత నాని హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాతలు రామ్ ఆచంట – గోపి ఆచంట – అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జులై 6న ప్రారంభమైన ఈ చిత్ర షెడ్యూల్ శరవేగంగా కొనసాగుతుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ అనంతపూర్ లో జరుగుతోంది. ఈ సినిమాలో నాని అనంతపూర్ నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పాత్రలో కనిపించనున్నాడు.. అందువల్ల ఈ చిత్రానికి ‘జై బాలయ్య’ అనే టైటిల్ ను చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nani  Jai Balayya  Hanu Raghavapudi  14 Reels Entertainments  

Other Articles