Female actors are paid less than their male counterparts: radhika apte

Radhika apte says pay disparity between male female actors frustrating

Radhika Apte says Pay disparity between male, female actors frustrating, actress radhika apte, Queen, Piku, Tanu Weds Manu Returns, high time female actors, payments equal to their male counterparts, Badlapur, Hunterrr, seductress Ahalya, Radhika Apte, audiences, on-screen outings, Female actors are paid less than their male counterparts

With the success of women-centric films like "Queen", "Piku" and "Tanu Weds Manu Returns", actress Radhika Apte feels it's high time female actors were paid equal to their male counterparts.

నటులతో సమానంగా తమకెందుకు పేమంట్లు ఇవ్వరు

Posted: 07/26/2015 08:01 PM IST
Radhika apte says pay disparity between male female actors frustrating

అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ చిత్రాలతో పాటు షార్ట్ ఫిల్మ్ లలో రస్తికట్టించే సన్నివేశాలలో నటిస్తూ తన సత్తాను చాటుకుంటున్న నటి రాధికా అప్టేకు ఒక్కసారిగా కోపం వచ్చేసింది. వరుసపెట్టి క్వీన్, పీకు, తను వెడ్స్ మను రిటర్న్స్ ఇలా హీరోయిన్ ఓరియెంటెండ్ చిత్రాలన్నీ బంపర్ హిట్ గా నిలుస్తున్నా.. హీరోయిన్లపై మాత్రం బాలీవుడ్ నిర్మాతలకు శీతకన్ను వుందని అమ్మడు ఏకంగా ఏకేసింది. ఫుల్ టైం హీరోయిన్లను బాలీవుడ్ ప్రేక్షక దేవుళ్లు ఆరాధిస్తున్నా, నిర్మాతలు మాత్రం తమ కష్టాన్ని గుర్తించడం లేదని తన వాదనను వినిపించింది అప్టే.

అదేంటంటరా, తమ చిత్రాలన్ని హిట్ అవుతున్నా హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు వచ్చే పారితోషకం ఇప్పటికీ తక్కువగానే వుందని అప్టే తన అవేదనను వ్యక్తం చేసింది. బద్దాపూర్, హంటర్ వంటి సినిమాలలో టాప్ పాత్రలు ఫోషించడంతో పాటు ఇటీవలే నెట్ లో హల్ చల్ చేస్తున్న అహల్య అనే షార్ట్ ఫిలింలో కూడా అప్టే నటించిన విషయం తెలిసందే. అందులో అమె నటన విమర్శకుల ప్రశంసలను అందుకునేలా చేసింది. అయినా పరిశ్రమలో మాత్రం హీరోయిన్లపై చిన్నచూపు వుందని, అందుకనే హీరోలకన్నా తక్కువగా పారితోషికం ఇస్తున్నారని అప్టే చెప్పింది.

ఇది ఒక్క చిత్ర పరిశ్రమకు సంబంధించిన అంశంకాదని, అన్ని చోట్లా ఇలాగే వుందని వాపోయింది. సినిమాలు కేవలం మగవాళ్ల వల్లే పూర్తి కావని, వాళ్లతో పాటు ఆడవాళ్లు కూడా ఉండాల్సిందేనని వ్యాఖ్యానించింది. అయితే అదే సమయంలో హీరోల ఇమేజ్ ఆధారంగా పలు చిత్రాలు బాలీవుడ్ లో కలెక్షన్లను రాబడుతుండడం కూడా తనకు తెలుసునని, అయితే హీరోయిన్ ఓరియెంటెండ్ చిత్రాలు కూడా వంద కోట్ల మార్కును అందుకున్నాయని, ఈ మార్పుతో పారితోషికాల్లో కూడా నిర్మాతలు కనబర్చాలని అప్టే విన్నవించింది. హీరో హీరోయిన్లే కాక క్యారెక్టర్ అర్టిస్టుల విషయంలో కూడా వివక్ష కనబడుతోందని రాధీకా అప్టే వ్యాఖ్యానించింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Radhika Apte  Pay disparity  male  female actors  frustration  

Other Articles