Petrol bomb attack on bahubali theatre

Petrol bomb attack on bahubali theatre

Petrol bomb attack on bahubali theatre, Petrol bomb attack on bahubali, Petrol bomb attack on bahubali, Bahubali movie latest updates, Bahubali movie collections, Bahubali hindi collections, Bahubali latest updates, Bahubali

Petrol bomb attack on bahubali theatre: Bahubali The Beginning Running Successfully in South India. Prabhas, Rana, Tamannah, Anushka, Ramya krishna acts in lead roles. SS Rajamouli diretion.

మధురైలో బాహుబలి థియేటర్ పై పెట్రోల్ బాంబ్ ఎటాక్

Posted: 07/22/2015 06:45 PM IST
Petrol bomb attack on bahubali theatre

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ‘బాహుబలి’ చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్ పై పెట్రోల్ బాంబు దాడి జరిగింది. ‘బాహుబలి’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం భాషలలో కూడా భారీ ఎత్తున విడుదల చేసారు.

ఈ చిత్రం అన్నిచోట్ల భారీ కలెక్షన్లతో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. అందులో భాగంగానే ‘బాహుబలి’ చిత్రం మధురైలో కూడా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. మధురైలో ‘బాహుబలి’ చిత్రం ప్రదర్శిస్తున్న ఓ థియేటర్ పై కొందరు పెట్రోల్ బాంబు దాడి చేసారు.

‘బాహుబలి’ సినిమాలో గిరిజనులను కించపరిచే విధంగా డైలాగులు, సన్నివేశాలు వున్నాయంటూ తమిళ పులి సంస్థకు చెందిన కొంతమంది కార్యకర్తలు ఈ దాడికి పాల్పడ్డారు. అలాంటి సీన్లు మరియు డైలాగులను వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేసారు. మరి ఈ విషయంపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తారో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bahubali  Petrol bomb attack  theatre madurai  Collections  Prabhas  

Other Articles