Cinema Chupista Mava Movie Release Date

Cinema chupista mava movie release date

Cinema Chupista Mava Release Date, Cinema Chupista Mava Trailers, Cinema Chupista Mava Movie News, Cinema Chupista Mava Movie Updates, Cinema Chupista Mava Stills, Cinema Chupista Mava Hot stills, Cinema Chupista Mava Heroine, Cinema Chupista Mava Songs, Cinema Chupista Mava

Cinema Chupista Mava Movie Release Date: Raj Tarun, Avika ghor latest film Cinema Chupista Mava. This film will be release on 14 August. Shekhar chandra music.

విడుదలకు సిద్ధమవుతున్న సినిమా చూపిస్త మావ

Posted: 07/17/2015 09:15 AM IST
Cinema chupista mava movie release date

‘నచ్చావులే, మేం వయసుకు వచ్చాం, కార్తికేయ’ చిత్రాలు సంగీత దర్శకుడిగా నాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి. కానీ.. ‘సినిమా చూపిస్త మావ’ చిత్రం ఆడియోకు వస్తున్న స్పందన నన్ను అంతులేనంత ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది’ అంటున్నారు యువ సంగీత దర్శకుడు శేఖర్‌చంద్ర. ‘ఉయ్యాల జంపాల’ ఫేం రాజ్‌తరుణ్‌, అవికాగౌర్‌ జంటగా.. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో అంజిరెడ్డి ప్రొడక్షన్స్‌ ఆర్‌.డి.జి ప్రొడక్షన్స్‌ ప్రై.లి. సమర్పణలో.. ఆర్యత్‌ సినీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి లక్కీ మీడియా పతాకంపై బోగాది అంజిరెడ్డి`బెక్కెం వేణుగోపాల్‌ (గోపి)`రూపేష్‌ డి.గోహిల్‌`జి.సునీత సంయుక్తంగా నిర్మిస్తున్న ‘సినిమా చూపిస్త మావ’ పాటలు ‘మధుర ఆడియో’ ద్వారా ఇటీవల విడుదల కావడం తెలిసిందే. పాటలకు లభిస్తున్న స్పందన కలిగిస్తున్న ఆనందాన్ని పంచుకోవడానికి ‘సినిమా చూపిస్త మావ’ సంగీత దర్శకుడు శేఖర్‌చంద్ర పాత్రికేయులతో ప్రత్యేకంగా ముచ్చటించారు.

‘‘రేడియో ఎఫ్‌.ఎం అన్నిటిలోనూ ‘సినిమా చూపిస్త మావ’ పాటలు టాప్‌ టెన్‌లో ఉన్నాయని, సెల్‌ఫోన్‌ రింగ్‌ టోన్స్‌ కూడా వేల సంఖ్యలో డౌన్‌లౌడ్‌ అవుతుండడం తనకు చాలా సంతోషాన్ని కలిగిస్తోందని.. రెబల్‌స్టార్‌ కృష్ణంరాజు, హీరో సునీల్‌, స్టార్‌ రైటర్‌ కోన వెంకట్‌ తదితర ప్రముఖులు పాటలు విని ప్రత్యేకంగా తనను ప్రశంసించడం తనకు ఎప్పటికీ మర్చిపోలేని మధురానుభూతినిస్తోందని శేఖర్‌చంద్ర అన్నారు. పాటలు ఇంత బాగా రావడంలో చిత్ర దర్శకులు త్రినాధరావు నక్కిన ప్రోత్సాహంతోపాటు.. నిర్మాత సహకారం సైతం ఎంతో ఉందని శేఖర్‌ చెప్పారు. ఈ ఆల్బంలోని ‘పిల్లి కళ్ల పాప’ పాటకు విపరీతమైన స్పందన వస్తోందని.. ఆ తర్వాత ‘సినిమా చూపిస్త మావా’ అంటూ సాగే టైటిల్‌ సాంగ్‌కు కూడా అంతే రెస్పాన్స్‌ వస్తోందని శేఖర్‌చంద్ర తెలిపారు. భాస్కరభట్ల రవికుమార్‌, వనమాలి, కృష్ణచైతన్య, ప్రసన్నకుమార్‌ (పరిచయం) అందించిన సాహిత్యం పాటల విజయంలో కీలక పాత్ర పోషిస్తోందని చెప్పిన శేఖర్‌.. వారితోపాటు ‘సినిమా చూపిస్త మావ’ ఆడియోను ప్రత్యేక శ్రద్ధతో ప్రమోట్‌ చేస్తున్న ప్రముఖ దర్శకులు మరియు ‘మధుర ఆడియో’ అధినేత మధుర శ్రీధర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి చేసుకొని.. అతి త్వరలో సెన్సార్‌కు వెళ్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టు`14న విడుద చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cinema Chupista Mava  Songs  Trailers  Release Date  

Other Articles