నటుడు శ్రీరాజన్ దర్శకత్వంలో హాట్ భామలు ప్రశాంతి, గీతాంజలి ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఎఫైర్’. భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ ను ఇటీవలే హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో విడుదల చేసారు.
ఈ కార్యక్రమానికి దర్శకుడు ఎన్ శంకర్, వల్లూరిపల్లి రమేష్, ప్రతాని రామకృష్ణ గౌడ్, వాసు మంతెన తదితరులు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా చిత్ర మోషన్ పోస్టర్ మరియు ట్రైలర్స్ ను విడుదల చేసారు. ఈ సంధర్భంగా నటుడు, దర్శకుడు శ్రీరాజన్ మాట్లాడుతూ... ‘ఎఫైర్’ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సహకరించిన తమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి కృతజ్ఞతలు. అలాగే ఈ సినిమా కథ విని తాము చేస్తామని ముందుకొచ్చి, ధైర్యాన్నిచ్చి అండగా నిలిచిన ప్రశాంతి, గీతాంజలిలకు కృతజ్ఞతలు. ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది అని చెప్పుకొచ్చారు.
కార్యక్రమంలో పాల్గొన్న వారంతా చిత్రం మంచి విజయం సాధించాలని ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ విభిన్నమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more