ప్రపంచ వ్యాప్తంగా మరో రెండు రోజుల్లో ‘బాహుబలి’ చిత్రం భారీ ఎత్తున దాడి చేయనున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటించారు. ఆర్కా మీడియా సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు.
ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమయిన ఈ చిత్ర మాస్టర్ కాపీ సిద్ధమయ్యింది. విడుదల తేది దగ్గర పడుతున్న కూడా ఈ చిత్ర విజువల్ ఎఫెక్ట్స్ యూనిట్ అంతా కూడా ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వుంటూ తుదిమెరుగులు దిద్దుతూనే వున్నాయి. అయితే మొత్తానికి ఈరోజుతో మాస్టర్ కాపీని సిద్ధం చేసేసారు. ఇక ప్రశాంతంగా ‘బాహుబలి - ది బిగినింగ్’ చిత్రాన్ని థియేటర్లలో ఆనందంగా చూడవచ్చు.
ఇప్పటి వరకు చిత్ర యూనిట్ లో వున్న టెన్షన్ కాస్త తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లు దుమ్మురేపుతున్నాయి. ప్రమోషన్
కార్యక్రమాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషలలో ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా జులై 10వ తేదిన విడుదల చేయనున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more