‘పటాస్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘షేర్’. సాయి నిహారిక, శరత్‌చంద్ సమర్పణలో మల్లికార్జున్ దర్శకత్వంలో కొమర వెంకటేష్ నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ పూర్తయ్యింది. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. అయితే తాజాగా కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సంధర్భంగా మరికొన్ని పోస్టర్ లను విడుదల చేసారు.
అలాగే ఈ చిత్ర ఫోటో టీజర్ ను కూడా విడుదల చేసారు. ఇందులో కళ్యాణ్ రామ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. చిత్ర దర్శకుడు మల్లికార్జున్ ఈ సినిమా విశేషాలు తెలియజేస్తూ... ‘‘మా ‘షేర్’ కళ్యాణ్ రామ్‌గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. కళ్యాణ్‌రామ్‌గారి కెరీర్లో ‘షేర్’ ఒక సెన్సేషనల్ మూవీ అవుతుంది. నందమూరి అభిమానులు పండగ చేసుకునేలా ఈ సినిమా వుంటుంది. ‘పటాస్’ తర్వాత మళ్ళీ కళ్యాణ్‌రామ్‌గారు ఈ సినిమాలో విజృంభించి నటించారు’’ అన్నారు.
నందమూరి కళ్యాణ్‌రామ్ సరసన సోనాల్‌చౌహాన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి కథ, మాటలు డైమండ్ రత్నబాబు అందిస్తున్నాడు. థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. సినిమాటోగ్రఫీ: సర్వేష్ మురారి, సమర్పణ: సాయి నిహారిక, శరత్‌చంద్, నిర్మాత: కొమర వెంకటేష్, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: మల్లికార్జున్.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more