Actress Raasi in naga shaurya kalyana vaibhogame

Actress raasi in naga shaurya kalyana vaibhogame

Raasi in naga shaurya kalyana vaibhogame, Actress Raasi latest news, Actress Raasi latest stills, Actress Raasi movie news, Actress Raasi movie updates, Actress Raasi movie details, Actress Raasi hot stills, Actress Raasi hot news, Actress Raasi

Actress Raasi in naga shaurya kalyana vaibhogame: tollywood actress raasi acts in important role in naga shaurya upcoming film kalyana vaibhogame. nandini reddy direction.

నాగశౌర్య సినిమాలో బొద్దుగుమ్మ రాశి

Posted: 06/30/2015 11:46 AM IST
Actress raasi in naga shaurya kalyana vaibhogame

ఒకప్పడు వరుస హిట్ చిత్రాలతో అగ్ర, స్టార్ హీరోలతో జతకట్టిన స్టార్ హీరోయిన్ అందాల ముద్దుగుమ్మ రాశి.. ఈ మధ్య క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటిస్తుంది. అయితే మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాశి బిజీ అవ్వడానికి సిద్ధమయ్యింది. తెలుగులో రాశి ఓ సినిమాలో నటించబోతుంది.

నాగశౌర్య హీరోగా ‘అలా మొదలైంది’ ఫేం నందిని రెడ్డి దర్శకత్వంలో ‘కళ్యాణ వైభోగమే’ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులోని ఓ కీలక పాత్ర కోసం రాశిని ఎంపిక చేసుకున్నారు. ఇటీవలే రాశిపై వచ్చే సన్నివేశాలను చిత్రీకరించినట్లుగా తెలిసింది. త్వరలోనే అన్ని వివరాలు ప్రకటించనున్నారు.

నాగశౌర్య సరసన ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేం మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాకు కళ్యాణ్ కోడూరి సంగీతం సమకూరుస్తున్నారు. చిత్ర షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.


Video Courtesy: Volga Video

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Raasi  naga shaurya  kalyana vaibhogame  movie news  

Other Articles