Malayalam Baahubali World Record poster

Malayalam baahubali world record poster

Malayalam Baahubali World Record poster, Baahubali Malayalam Audio Launch, Baahubali Malayalam Audio Launch, Baahubali movie updates, Baahubali latest stills, Baahubali latest posters, Baahubali movie stills, Baahubali audio details, Baahubali tamil updates, Baahubali hindi updates, Baahubali

Malayalam Baahubali World Record poster: Baahubali movie Malayalam version Audio Released. SS Rajamouli Direction, MM Keeravani Music. Prabhas, Rana, Anushka, Tamannah acts in lead roles.

మలయాళంలో బాహుబలి వరల్డ్ రికార్డ్ పోస్టర్

Posted: 06/29/2015 10:19 AM IST
Malayalam baahubali world record poster

రాజమౌళి ‘బాహుబలి’ చిత్రం వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయనుంది. అయితే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ విజయం సాధించి, వరల్డ్ రికార్డు క్రియేట్ చేయనుందని గతకొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. ఈ రికార్డు సినిమా గురించి కాదు. ‘బాహుబలి’ పోస్టర్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేయనుందని తెలుస్తోంది.

‘బాహుబలి’ సినిమా మలయాళం వర్షెన్ కు సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవలే కొచ్చిలో గ్రాండ్ గా జరిగింది. ఈ సందర్భంగా మలయాళంలో ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన గ్లోబల్ యునైటెడ్ మీడియా వారు ఓ అరుదైన రికార్డ్ ని క్రియేట్ చేసారు. ‘బాహుబలి’ సినిమాకు సంబంధించిన అతిపెద్ద పోస్టర్ ను ఏర్పాటు చేసారు. ఈ పోస్టర్ ఆర్గనైజర్స్ వారు దీనిని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కోసం పంపించనున్నారు.

ఈ మలయాళం ఆడియో వేడుకను చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేసారు. ఇందులో రాజమౌళి, ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క తదితరులు పాల్గొన్నారు. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషలలో ఏకకాలంలో జులై 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali  World Record poster  Malayalam Audio Launch  Prabhas  Rajamouli  

Other Articles