Prabhas clarifies on bollywood entry

Prabhas clarifies on bollywood entry

Prabhas ready to do hindi movies, Prabhas movie news, Prabhas movie updates, Prabhas baahubali movie, Prabhas latest stills, Prabhas latest news, Prabhas latest movies, Baahubali movie news, Baahubali movie updates, Baahubali

Prabhas clarifies on bollywood entry: Young rebel star prabhas upcoming film Baahubali. this film will be release on 10 july. ss rajamouli director. prabhas, rana, tamannah, anushka in lead roles.

దొరికితే తప్పకుండా వస్తానంటున్న బాహుబలి

Posted: 06/22/2015 04:16 PM IST
Prabhas clarifies on bollywood entry

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ‘మిర్చి’ సినిమాలో ప్రభాస్ చెప్పినట్లుగా ‘కటౌట్ చూసి కొన్నికొన్ని నమ్మేయాలి డ్యూడ్’ అనే డైలాగ్ ను బాలీవుడ్ సినీజనాలు, దర్శకనిర్మాతలు బాగా గుర్తుంచుకున్నారు. అందుకే బాలీవుడ్ లో కూడా ప్రభాస్ కు భారీ క్రేజ్ వుంది.

ఇటీవలే వచ్చిన ‘యాక్షన్ జాక్సన్’ సినిమాలో ప్రభాస్ ఓ సాంగ్ లోని మ్యూజిక్ బిట్ లో గెస్ట్ అప్పియరెన్స్ గా డాన్స్ చేసాడు. ఆ సినిమా హిట్టుకాకపోయినా... ప్రభాస్ మాత్రం బాగానే క్లిక్ అయ్యాడు. ఇకపోతే ప్రస్తుతం బాలీవుడ్ లో ప్రభాస్ దుమ్ములేపుతోంది. ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న సంధర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో భారీగా పాల్గొంటుంది.

ఇందులో ప్రభాస్ ఇటీవలే ముంబైలోని ‘బాహుబలి’ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. అక్కడి మీడియా వారికి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తాను కూడా బాలీవుడ్ సినిమాలు చేయడానికి సిద్ధంగానే వున్నానని, అయితే మంచి కథ దొరికితే తప్పకుండా హిందీలో సినిమా చేస్తానంటూ ప్రభాస్ చెప్పుకొచ్చాడు.

దీంతో ప్రభాస్ కోసం ఓ పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైన్ సినిమాను తీయడానికి ఇప్పటికే పలువురు దర్శకనిర్మాతలు రెడీ అయినట్లుగా తెలిసింది. ప్రభాస్ కు త్వరలోనే మంచి స్క్రిప్టు వినిపించి ఓకే చేయించాలని పలువురు దర్శకనిర్మాతలు సన్నాహాల్లో వున్నట్లుగా తెలిసింది. మరి ప్రభాస్ హిందీ ఎంట్రీ సినిమా అవకాశం ఎవరికి లభించనుందో చూడాలి.

ప్రస్తుతం ‘బాహుబలి’ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో ప్రభాస్ బిజీగా వున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషలలో జులై 10వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali  Prabhas  Movie news  stills  

Other Articles