Mahesh Babu Srimanthudu Nizam rights sold out

Mahesh babu srimanthudu nizam rights sold out

Srimanthudu Nizam rights sold for Rs. 14.4 crores, Srimanthudu Nizam rights got Abhishek pictures, Zee Telugu Bags Srimanthudu Movie Satellite Rights, Srimanthudu Movie news, Srimanthudu Movie latest updates, Srimanthudu Movie stills, Srimanthudu Movie trailer, Srimanthudu Movie posters, Srimanthudu Movie audio, Srimanthudu Movie release dates, Srimanthudu Movie

Mahesh Babu Srimanthudu Nizam rights sold out: Mahesh Babu latest upcoming film Srimanthudu will be release on 7th August. Srimanthudu Nizam rights sold for Rs. 14.4 crores to Abhishek pictures.

భారీ రేటుకు నైజాంలో అమ్ముడుపోయిన శ్రీమంతుడు

Posted: 06/19/2015 10:30 AM IST
Mahesh babu srimanthudu nizam rights sold out

మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ నైజాం ఏరియాలో భారీ రేటుకు అమ్ముడుపోయాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ మరియు ఎం.బి.ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ చిత్ర నైజాం ఏరియా రైట్స్ ను ఎన్ ఆర్ ఎ బేసిస్ లో అభిషేక్ పిక్చర్స్ అభిషేక్ సొంతం చేసుకున్నాడు. 14 కోట్ల 40 లక్షలకు ఈ నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకున్నాడు.

ఈ సంధర్భంగా అభిషేక్ మాట్లాడుతూ... మహేష్ బాబు గారి ‘శ్రీమంతుడు’ నైజాం ఏరియా రైట్స్ మాకు దక్కినందుకు చాలా ఆనందంగా వుంది. డెఫినెట్ గా ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుంది. ఈ సంధర్భంగా చిత్ర యూనిట్ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని తెలిపారు.

భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను వచ్చే నెల 18న విడుదల చేసి, చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆగష్టు 7న విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahesh Babu  Srimanthudu  Nizam rights  sold  Abhishek pictures  

Other Articles