hero gopichand says corporate doctors to give free service to poor

Hero gopichand statement on doctors

Hero gopichand, doctors, free service, corporate hospitals, tollywood, service to poor, service to society, service to man kind, gopichand movies, gopichand hits, gopichand gallaries, gopichand new movies, gopichand musical hits, gopichand collections, gopichand forth comming movies

tollywood hero gopichand says corporate doctors should give free service to poor

పేదలకు ఉచిత వైద్యాన్ని అందించాలి..

Posted: 06/14/2015 07:43 PM IST
Hero gopichand statement on doctors

కార్పొరేట్ ఆస్పత్రుల వైద్యులు సామాజిక సృహ కలిగి, పేద, బడుగు వర్గాల కోసం ఉచితంగా వైద్య సేవలందించాలని సినీ హీరో గోపీచంద్ పేర్కొన్నారు. గత 18 ఏళ్లుగా వందలాది మంది పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలందించి మందులు కూడా పంపిణీ చేస్తున్న ఉమేష్ చంద్రను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఆదివారం అబిడ్స్ బొగ్గులకుంటలో ఉమా హార్ట్‌ కేర్ సెంటర్‌లో డాక్టర్ ఉమేష్ చంద్ర ఆధ్వర్యంలో కొనసాగిన 186వ ఉచిత హృద్రోగ వైద్య శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.

డాక్టర్ ఉమేష్‌చంద్ర మాట్లాడుతూ.. ప్రతినెలా ఉచితంగా వైద్యశిబిరాలు నిర్వహించి ఎంతో ఖరీదైన వైద్యసేవలు, మందులను కూడా పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఈసీజీ, రక్త పరీక్షలు, బ్లడ్ షుగర్, ఇతర చెకప్‌లు కూడా ఉచితంగా చేయిస్తామని తెలిపారు. ప్రతినెలా 2వ ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా 200 మంది పేషెంట్లకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hero gopichand  doctors  free service  corperate hospitals  

Other Articles