Nara Rohit Latest Movie Muhurtham Programme In Hyderabad | Tollywood Movie News

Nara rohit new movie shooting launch programme in hyderabad

nara rohit, nara rohit new movie, kabir singh, nara rohit updates, nara rohit latest movie launch, nara rohit photos, nara rohit photo gallery, nara rohit gallery, nara rohit photo shoot, nara rohit new movie updates, nara rohit movie launch, kumar nagendra, sri kirthi banners

Nara Rohit New Movie Shooting Launch Programme In Hyderabad : Nara Rohith Starts His Latest Movie In Kumar Nagendra Directorial. This movie muhurtham programme has done in hyderabad.

మరో సినిమాకి రెడీ అయిన ‘అసురు’డు!

Posted: 06/12/2015 06:29 PM IST
Nara rohit new movie shooting launch programme in hyderabad

విభిన్న కథాచిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న యువహీరో నారారోహిత్.. ఇటీవల ‘అసుర’ చిత్రంతో మంచి విజయం అందుకున్నాడు. ఈ మూవీ సక్సెస్ ఉత్సాహంలో వున్న ఈ హీరో.. అప్పుడే మరో సినిమాకి సిద్ధమైపోయాడు. నారా రోహిత్ తాజా మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమం శుక్రవారం ఉదయం హైదరాబాదులో జరిగింది. ఈ హీరో కోరుకున్న విధంగానే ఈ సినిమా షూటింగ్ లాంచ్ కార్యక్రమం చాలా సింపుల్ గా జరిగింది.

శ్రీకీర్తి బ్యానర్ పై నిర్మించబడుతోన్న నారా రోహిత్ తాజా సినిమాకి కుమార్ నాగేంద్ర దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటివరకు వచ్చిన రోహిత్ సినిమాలకు ఇది పూర్తి భిన్నంగా, వినోదాత్మకంగా వుంటుందని దర్శకనిర్మాతలు పూజా కార్యక్రమం సందర్భంగా వెల్లడించారు. అంతేకాదు.. ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మితమవుతోందని చెప్పారు. ఏ విధంగా నారా రోహిత్ కొత్త కథలను ఎంచుకుంటారో.. అలాగే ఈ సినిమా కథ చాలా కొత్తగా వుంటుందని అంటున్నారు. ఏ.ఆర్.మురగదాస్ అందించిన కథ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుందని దర్శకనిర్మాతలు నమ్మకం వ్యక్తం చేశారు.

ఇక ఈ సినిమాలో విలన్ గా ‘జిల్’ మూవీ ఫేం కబీర్ సింగ్ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రోహిత్, కబీర్ కి మధ్య వుండే యాక్షన్ సన్నివేశాలు భారీ స్థాయిలో వుంటాయని, మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయని చిత్రబృందం తెలిపింది. మొత్తంగా ఈ చిత్రం రోహిత్ కెరీర్ లో చెప్పుకోదగిన సినిమాలు నిలిచిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే.. ఈ చిత్రం కథానాయికను ఇంకా ఎంపిక చేయాల్సి వుంది. త్వరలోనే చిత్రబృందం ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nara rohit  kabir singh  kumar nagendra  sri kirthi banners  

Other Articles