Young Young Hero Nitin out from puri jagannadh Latest Project | varun tej | tollywood gossips

Young hero nitin out from puri jagannadh new project varun tej in

Young Hero Nitin out from puri jagannadh new project varun tej in : According to some reasons young hero out from puri jagannadh's latest project and Varun tej come in.

Young Hero Nitin out from puri jagannadh new project varun tej in : According to some reasons young hero out from puri jagannadh's latest project and Varun tej come in.

నితిన్ ఔట్.. వరుణ్ ఇన్.. ఇక పూరీలే!

Posted: 06/11/2015 01:12 PM IST
Young hero nitin out from puri jagannadh new project varun tej in

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ యువహీరో నితిన్ తో ఓ మూవీ చేయనున్నట్లు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే! చిరు 150వ మూవీ షూటింగ్ ప్రారంభం నాటికి నితిన్ తో పూరీ ఓ చిత్రం పూర్తి చేయనున్నట్లు వార్తలు షికారు చేశాయి. అంతేకాదు.. తమ మూవీకి సంబంధించి స్ర్కిప్ట్ వర్క్ పూర్తయ్యిందని, ఈనెల 15వ తేదీ నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని వారిరువురు తమ అభిమానులకు తెలియజేశారు కూడా!

కానీ.. ఇంతలోనే ఏమయ్యిందో తెలీదు కానీ.. పూరీ, నితిన్ లా మూవీ ఒక్కసారిగా ఆగిపోయింది. పూరీతో కలిసి చేయాల్సిన సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయిందని, త్వరలోనే ఆయనతో లికిసి పనిచేసే అవకాశం లభించాలని కోరుకుంటున్నానని నితిన్ ట్విటర్ ద్వారా స్పష్టం చేశాడు. దీంతో ఈ సినిమా ఇలా అకస్మాత్తుగా ఆగిపోవడం సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే విషయంపై దర్శకుడు పూరీ తనదైన తరహాలో అభిమానులకు స్పష్టత ఇచ్చాడు. నితిన్ సినిమా ఆగిపోయిన విషయాన్ని తెలియజేస్తూ ఇదే కథను వేరే హీరోతో ముందుగా చెప్పిన రోజునే షూటింగ్ మొదలవుతుందని స్పష్టం చేశాడు. ఆ మరో హీరో మరెవ్వరో కాదు.. మెగాకుటుంబం నుంచి వచ్చిన యువహీరో వరుణ్ తేజ్. ‘ముకుందా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో.. నితిన్ ప్లేస్ లో పూరీ సినిమాలో హీరోగా నటించనున్నాడు.

నిజానికి పూరీ, వరుణ్ తేజ్ మొదటి సినిమాకు దర్శకత్వం వహించాల్సి ఉండగా అది కొన్ని కారణాల వల్ల వర్కవుట్ కాలేదు. ఇప్పుడు ఈ కాంబినేషన్ మళ్ళీ ఇలా కలవడం ఆసక్తికరంగా మారింది. బహుశా వరుణ్ పేరు ముందుగా తెలిపినట్లు నితిన్ ని తన ప్రాజెక్ట్ నుంచి తొలగించి, ఆ మెగా హీరోతో ఒప్పందం కుదుర్చుకున్నాడేమోనని ఫిలింనగర్ లో టాక్ వినిపిస్తోంది. ఈనెల్లోనే ఈ సినిమా లాంచ్ కానుందని సమాచారం! పూరీ-వరుణ్ కాంబోలో రూపొందనున్న ఈ సినిమాను సి. కళ్యాణ్ నిర్మించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hero nitin  puri jagannadh  varun tej  

Other Articles